News February 6, 2025

‘ఇంటింటికీ వెళ్లి అంగవైకల్యం గల చిన్నారులను గుర్తించాలి’

image

విశాఖ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెంకట శేషమ్మ అవగాహన నిర్వహించారు. ఫిబ్రవరి 10 నుంచి 24 వరకు సిబ్బంది ఇంటింటికి వెళ్లి అంగవైకల్యం గల చిన్నారులను గుర్తించాలన్నారు. మానసికంగా, శారీరకంగా వైకల్యం ఉన్న పిల్లలకు వైద్యం అందిస్తే చిన్నతనంలోనే మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉంంటుందన్నార. అన్ని శాఖల సమన్వయంతో ముందుకు సాగాలన్నారు.

Similar News

News March 23, 2025

నేడు విశాఖ రానున్న గవర్నర్

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆదివారం విశాఖ రానున్నారు. సాయంత్రం 8:55 విశాఖ ఎయిర్ పోర్ట్‌‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రుషి కొండ వద్ద ఉన్న ఓ హోటల్‌కు చేరుకుంటారు. రాత్రికి అక్కడ బస చేస్తారు. సోమవారం విశాఖలో ఉండి మంగళవారం సాయంత్రం విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి విజయవాడ వెళ్తారు. వీటికి తగ్గట్టు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News March 23, 2025

విశాఖలో రేపే మ్యాచ్..

image

దేశంలో IPL ఫీవర్ స్టార్ట్ అయింది. శనివారం నుంచి మ్యాచ్‌లు మొదలు కాగా క్రికెట్ అభిమానులు ఉర్రూతలూగుతున్నారు. కాగా ఈ ఏడాది విశాఖ 2 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం విశాఖలో జరిగే ఢిల్లీ- లక్నో మ్యాచ్‌కు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు ACA తెలిపింది. రేపు సాయంత్రం 6.30 నుంచి మెగా సెలబ్రేషన్స్‌తో విశాఖలో ఐపీఎల్ సందడి మొదలు కానుంది. రాత్రి 7.30కు మ్యాచ్ ప్రారంభమవుతుంది.

News March 23, 2025

కశింకోటలో యాక్సిడెంట్.. UPDATE

image

కశింకోట మండలం త్రిపురవానిపాలెం జంక్షన్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే. అనకాపల్లి నుంచి ఎలమంచిలి వైపు వెళుతున్న లారీ డ్రైవర్ ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా అవతలి రోడ్డుకు వెళ్లడానికి లారీని మలుపు తిప్పాడు. అదే మార్గంలో వస్తున్న మరో లారీ వెనుక నుంచి ఢీకొంది. దీంతో వెనక లారీ డ్రైవర్ షేక్ మస్తాన్ వల్లి అక్కడికక్కడే మృతి చెందినట్లు సీఐ స్వామి నాయుడు తెలిపారు

error: Content is protected !!