News February 26, 2026

ఇంటికే భద్రాద్రి తలంబ్రాలు: ఆర్ఎం

image

శ్రీరామనవమి పురస్కరించుకుని భద్రాచలం వెళ్లలేని భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సదుపాయం కల్పించిందని ఆర్ఎం భవాని ప్రసాద్ తెలిపారు. ఆర్టీసీ లాజిస్టిక్స్, దేవాదాయ శాఖ సహకారంతో సీతారాముల కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేరవేసే కార్యక్రమం చేపట్టామన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని భక్తులు రూ.151 చెల్లించి ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో లేదా ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని సూచించారు.

Similar News

News April 12, 2026

తిరుమల దర్శనం టికెట్ల విడుదల తేదీలు ఇవే..!

image

తిరుమల జులై నెల దర్శన టోకెన్ల విడుదల తేదీలను TTD ప్రకటించింది. ఏప్రిల్ 18న ఉ.10 గంటలకు ఆర్జిత సేవల టికెట్లు విడుదలవుతాయి. ఏప్రిల్ 20 వరకు ఎలక్ట్రానిక్ డిప్‌ నమోదు చేసుకోవాలి. 20-22 వరకు చెల్లింపులు చేయాలి. ఏప్రిల్ 21న కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆరోజు మధ్యాహ్నం వర్చువల్ సేవలు, ఏప్రిల్ 23న అంగప్రదక్షిణ, శ్రీవాణి, వృద్ధులు–దివ్యాంగుల దర్శన టోకెన్లు, ఏప్రిల్ 24న రూ.300 టికెట్లు, గదుల కోటా విడుదలవుతుంది.

News April 12, 2026

హార్ముజ్‌లో టెన్షన్.. పాక్ ట్యాంకర్ యూటర్న్

image

హార్ముజ్ జలసంధి దగ్గర హైడ్రామా చోటుచేసుకుంది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం కావడంతో 2 భారీ ఆయిల్ ట్యాంకర్లు చివరి నిమిషంలో యూటర్న్ తీసుకున్నాయి. పాక్, ఇరాక్‌కు చెందిన ఈ నౌకలు ఒమన్ గల్ఫ్ నుంచి పర్షియన్ గల్ఫ్‌లోకి వెళ్లాల్సి ఉంది. కానీ ఇరాన్ దగ్గరకు రాగానే వెనక్కి వెళ్లాయి. నిజానికి పాక్, ఇరాక్ నౌకలకు తొలుత ఇరాన్ అనుమతి ఇచ్చింది. కానీ చర్చలు ఫెయిల్ కావటంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.

News April 12, 2026

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో గుత్తి విద్యార్థి సత్తా

image

తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాల్లో గుత్తికి చెందిన మీసేవ నిర్వాహకుడు సురేశ్ కుమారుడు సుజిత్ కుమార్ సత్తా చాటాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో చదువుతున్న సుజిత్ కుమార్.. ఎంపీసీలో 1000 మార్కులకు గాను 989 మార్కులు సాధించాడు.