News March 18, 2025
ఇంటి వద్దకే రాములు వారి తలంబ్రాలు: ఆర్టీసీ RM బి.రాజు

భద్రాచలంలో ఏప్రిల్ 6న శ్రీ సీతారాముల వారి కల్యాణాన్ని పురస్కరించుకొని అక్కడకు వెళ్లలేని భక్తులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ కార్గో ద్వారా సీతారాముల కల్యాణ తలంబ్రాలను ఇంటి వద్దకే పంపించే ఏర్పాటు చేశామని RM బి.రాజు తెలిపారు. ఇందుకు గాను ఒక్కొక్క ప్యాకెట్ కు రూ.151 ఆన్లైన్ లేదా అన్ని బస్టాండ్ కార్గో సెంటర్లు, ఏజెంట్ కౌంటర్ల వద్ద గాని బుక్ చేసుకోవచ్చని చెప్పారు.
Similar News
News November 28, 2025
వనపర్తి: నామినేషన్కు ముందు కొత్త ఖాతా తప్పనిసరి: శ్రీనివాసులు

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసే అభ్యర్థులు తమ పేరు మీద కొత్త బ్యాంక్ అకౌంట్ తెరవాలని, ఎన్నికల వ్యయం మొత్తాన్ని దీని ద్వారానే చేయాలని వ్యయ పరిశీలకులు శ్రీనివాసులు తెలిపారు. నామినేషన్ సమయంలో ఇచ్చే ఎక్స్పెండీచర్ బుక్లో ప్రతి ఖర్చును నమోదు చేయాలని సూచించారు. 15 రోజులకు ఒకసారి ఆ వివరాలను నోడల్ అధికారికి చూపించి సంతకం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన వివరించారు.
News November 28, 2025
కోకాపేట భూములు అ‘ధర’గొట్టాయి!

HYDలోని కోకాపేటలో నవంబర్ 28న జరిగిన భూముల ఈ-వేలంలో భారీ మొత్తంలో ధరలు నమోదయ్యాయి. నియోపోలిస్, గోల్డెన్ మైల్ ఏరియాల్లోని 15, 16 నంబర్ ప్లాట్లకు ఈ వేలం జరిగింది. ఈ వేలంలో ఒక్కో ఎకరం ₹140 కోట్లు చొప్పున పలికింది. ఈ 2 ప్లాట్లకు కలిపి మొత్తం ₹1268 కోట్లు ఆదాయం వచ్చినట్లు సమాచారం. రియల్ ఎస్టేట్ చరిత్రలో కోకాపేట భూములకు వచ్చిన ఈ ధరలు రికార్డు సృష్టించాయి.
News November 28, 2025
వనపర్తి: ఓటర్లను ప్రలోభ పెట్టొద్దు: పరిశీలకులు

వనపర్తి జిల్లాలో ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసేందుకు వీలుగా ప్రశాంత వాతావరణం కల్పించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎన్నికల సాధారణ పరిశీలకులు మల్లయ్య బట్టు సూచించారు. ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా పార్టీలు తమ వంతు సహకారం అందించాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని (ఎంసీసీ) తూచా తప్పకుండా పాటించాలని ఆయన స్పష్టం చేశారు.


