News March 18, 2025
ఇంటి వద్దకే రాములు వారి తలంబ్రాలు: ఆర్టీసీ RM బి.రాజు

భద్రాచలంలో ఏప్రిల్ 6న శ్రీ సీతారాముల వారి కల్యాణాన్ని పురస్కరించుకొని అక్కడకు వెళ్లలేని భక్తులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ కార్గో ద్వారా సీతారాముల కల్యాణ తలంబ్రాలను ఇంటి వద్దకే పంపించే ఏర్పాటు చేశామని RM బి.రాజు తెలిపారు. ఇందుకు గాను ఒక్కొక్క ప్యాకెట్ కు రూ.151 ఆన్లైన్ లేదా అన్ని బస్టాండ్ కార్గో సెంటర్లు, ఏజెంట్ కౌంటర్ల వద్ద గాని బుక్ చేసుకోవచ్చని చెప్పారు.
Similar News
News March 19, 2025
మందమర్రి ఏరియాలో 1972కారుణ్య నియామకాలు:GM

మందమర్రి ఏరియాలో 40 మందికి కారుణ్య నియామకపత్రాలను ఏరియా జీఎం దేవేందర్ మంగళవారం అందజేశారు. అనంతరం జీఎం మాట్లాడుతూ.. ఏరియాలో ఇప్పటివరకు 1972 మందికి కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగాలు ఇప్పించామని పేర్కొన్నారు. ఉద్యోగులు విధులకు గైర్హాజరు కాకుండా బొగ్గు ఉత్పత్తికి సహకరించాలని ఆయన సూచించారు.
News March 19, 2025
యుద్ధం ముగింపుకు అంగీకరించిన పుతిన్ : వైట్‌హౌస్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకు పుతిన్ అంగీకరించినట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. రష్యా అధ్యక్షుడితో ట్రంప్ ఫోన్‌లో చర్చలు జరిపారు. ఈమేరకు యుద్ధానికి స్వస్థి పలకాలని విజ్ఞప్తి చేయగా పుతిన్ అంగీకరించినట్లు శ్వేతసౌధం తెలిపింది. గత కొంతకాలంగా యుద్ధం ముగింపుకు అమెరికా అధ్యక్షుడు ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.
News March 19, 2025
NLG: ఈనెల 22న ప్రత్యేక ప్రజావాణి: కలెక్టర్

నల్లగొండ జిల్లాలో వివిధ సమస్యలతో బాధపడుతున్న వయోవృద్దులు, దివ్యాంగుల కోసం ఈనెల 22న నల్గొండ కలెక్టరేట్లో ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. సాయంత్రం 3గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని వృద్ధులు, దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.