News November 9, 2024
ఇంటి వద్దే ఈకేవైసీ నమోదు: నిధి మీనా

ఉచిత గ్యాస్ సిలిండర్‌కు అర్హులైన వినియోగదారులకు వారి ఇంటి వద్దే గ్యాస్ డెలివరీ బాయ్స్చే ఈకేవైసీ నమోదు చేసుకునే సదుపాయం ఉందని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ నిధి మీనా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకానికి బియ్యం కార్డు, గ్యాస్ కనెక్షన్, అధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ కలిగిన వారు అర్హులన్నారు. వినియోగదారులు తమ మొదటి ఉచిత సిలిండర్‌ను గ్యాస్ ఏజెన్సీలో మార్చిలోపు బుక్ చేసుకోవచ్చన్నారు.
Similar News
News December 16, 2025
మచిలీపట్నం చేరుకున్న నారా లోకేష్

టీడీపీ యువ నాయకుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం మచిలీపట్నం చేరుకున్నారు. స్థానిక న్యూ హౌసింగ్ బోర్డ్ సర్కిల్లో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి కాంస్య విగ్రహావిష్కరణలో పాల్గొనేందుకు ఆయన మచిలీపట్నం చేరుకున్న లోకేష్‌కు 3 స్థంభాల సెంటర్లో మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో టీడీపీ, బీజేపీ కార్యకర్తలు స్వాగతం పలికారు.
News December 16, 2025
మచిలీపట్నం: ‘అటల్-మోదీ’ బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఇదే.!

నేడు మచిలీపట్నం రానున్న ‘అటల్-మోదీ’ సుపరిపాలన బస్సు యాత్ర రూట్ మ్యాప్‌ను ఆ పార్టీ నేతలు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక మూడు స్థంభాల సెంటర్ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. చల్లరాస్తా సెంటర్, కోనేరుసెంటర్, బస్టాండ్, లక్ష్మీటాకీస్, డీ మార్ట్ రోడ్డు మీదుగా న్యూ హౌసింగ్ బోర్డ్ సర్కిల్‌కు చేరుకుంటుంది. వాజ్ పేయి విగ్రహావిష్కరణ అనంతరం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
News December 16, 2025
పేకాట శిబిరాలకు కృష్ణా జిల్లా అడ్డాగా మారుతోందా.?

పేకాట శిబిరాలకు కృష్ణా జిల్లా వేదికగా మారుతోందా.? అన్న సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. జూద క్రీడలు రోజు రోజుకు విస్తరిస్తుండటంమే దీనికి నిదర్శనం. పేకాట వల్ల మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని ప్రజలు వాపోతున్నారు. జిల్లా ఎస్పీ జూద శిబిరాలపై, యాంటీ డ్రగ్ నిర్మూలనపై ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ, కింది స్థాయి సిబ్బంది పనితీరు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.


