News March 28, 2025
ఇంట్లో పేకాట.. విశాఖలో 11 మంది అరెస్ట్

హెచ్బి కాలనీలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న వారిని ఎంవీపీ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.22,450 నగదు స్వాధీనం చేసుకున్నారు. 11 మందిపై కేసు నమోదు చేశారు. నగరంలో ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
Similar News
News April 3, 2025
TTC ట్రైనింగ్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానం: డీఈవో

విశాఖ జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో TTC ట్రైనింగ్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు డీఈవో ప్రేమ్ కుమార్ బుధవారం తెలిపారు. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 25లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. మే1 నుంచి జూన్ 11 వరకు ట్రైనింగ్ ఇవన్నున్నట్లు తెలిపారు. 18 నుంచి 45 సంవత్సరాల లోపు వారు అర్హులన్నారు. పూర్తి వివరాలు, అప్లికేషన్కు www.bse.ap.gov.inలో చెక్ చేయాలన్నారు. మే 1 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయన్నారు.
News April 2, 2025
రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం: విశాఖ సీపీ

విశాఖ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా ప్రమాద బాధితులకు బుధవారం లక్ష రూపాయలు పరిహారం అందజేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఇటీవల హిట్ రన్లో తీవ్ర గాయాలపాలైన మొండెం రామక్రిష్ణ, జన సన్యాసప్పాడుకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేశారు. ఇప్పటివరకు ఈ కేంద్రం ద్వారా 32 మందికి రూ.26,50,000 ఇచ్చినట్లు తెలిపారు.
News April 2, 2025
విశాఖ మీదుగా బయలుదేరే రైళ్లకు అదనపు బోగీలు

విశాఖ మీదుగా బయలుదేరే రైళ్లకు అదనపు బోగీలు వేయనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ బుధవారం తెలిపారు. విశాఖ -బరాంపూర్ ఎక్స్ ప్రెస్ (18526/25)కు ఏప్రిల్ 1నుంచి ఏప్రిల్ 30 వరకు 2 జనరల్ కోచ్, విశాఖ-రాయ్పూర్ (58528/27)కు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30వరకు ఒక జనరల్ కోచ్, విశాఖ- కొరాపుట్(58538/37) ఒక జనరల్ కోచ్, విశాఖ-భవానీపట్నం పాసంజర్కు (58504/03)ఒక జనరల్ కోచ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.