News August 21, 2024
ఇండస్ట్రీలతో ఉపాధి అవకాశాలు: డీకే అరుణ

ఇండస్ట్రీలు, కంపెనీలు ఏర్పాటు చేయడం ద్వారా యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆస్కారం ఉంటుందని MBNR ఎంపీ డీకే అరుణ అభిప్రాయం వ్యక్తం చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో రైతులకు ఇబ్బంది, నష్టం జరగకుండా ప్రభుత్వం ఫార్మా విలేజ్ కోసం భూసేకరణ చేయాలన్నారు. రైతులు, కూలీల వలసల నివారణకు ఉపాధి అవకాశాలు కల్పించడమే సరైన పరిష్కారమని ఎంపీ పేర్కొన్నారు.
Similar News
News December 6, 2025
సల్కర్ పేటలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

గడిచిన 24 గంటల్లో మహబూబ్ నగర్ జిల్లాల్లో చలి తీవ్రత స్వల్పంగా పెరిగింది. గండీడ్ మండలం సల్కర్ పేటలో 12.8 డిగ్రీలు అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. బాలానగర్ 13.3, మిడ్జిల్ మండలం దోనూరు 13.4, రాజాపూర్ 13.6, జడ్చర్ల 14.1, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్, పారుపల్లి 14.7, భూత్పూర్ 14.9 డిగ్రీల అత్యంత ఉష్ణోగ్రత నమోదయింది.
News December 6, 2025
MBNR: ప్రభుత్వ ఉద్యోగులు.. ALERT!

మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి విడతలో గండీడ్, మహమ్మదాబాద్, నవాబుపేట, రాజాపూర్, మహబూబ్ నగర్లలో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఈనెల 8న తమ ఫారం-14 తీసుకొని నేరుగా తమ ఓటు హక్కు ఉన్న మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రంలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు తమ ఓటును వేయొచ్చని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు.
#SHARE IT.
News December 5, 2025
MBNR: ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వెయ్యండి: కలెక్టర్

గ్రామపంచాయతీలో ఓటరుగా ఉండి, ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి అర్హులని కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. ఇప్పటివరకు ఫారం-14 (పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు) దరఖాస్తు చేసుకున్న వారికి పోస్టల్ బ్యాలెట్ పంపడానికి ఎన్నికల యంత్రాంగం కసరత్తు చేపట్టిందని, మరో అవకాశంగా పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు.
SHARE IT.


