News April 9, 2024

ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గద్దల రాజు

image

పత్తికొండ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలవనున్నట్లు గద్దల రాజు తెలిపారు. ఆదివారం పత్తికొండలో విలేకరులతో ఆయన మాట్లాడారు. నియోజకవర్గం అభివృద్ధి చేయాలని తపనతో తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నానని అన్నారు. గతంలో అనేక పార్టీల నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు.. మంత్రి పదవులు చేపట్టినా నియోజకవర్గం అభివృద్ధి నోచుకోలేదన్నారు. తాగు, సాగునీరు అందించడంలో స్థానిక ఎమ్మెల్యేలు విఫలమయ్యారన్నారు.

Similar News

News October 23, 2025

రైతులకు భూమాత రక్షణ, మిశ్రమ పంటలపై అవగాహన కల్పించండి: కలెక్టర్

image

భూమాత రక్షణ కార్యక్రమం ద్వారా రైతులకు మిశ్రమ పంటల సాగు, ఎరువుల సమర్థ వినియోగంపై అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డా.ఏ.సిరి ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఎక్కువ రసాయన ఎరువులు ఉపయోగిస్తున్న 100 గ్రామపంచాయతీలను గుర్తించి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సబ్ డివిజనల్, గ్రామస్థాయిల్లో భూమాత రక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు.

News October 23, 2025

వలసబాట పట్టిన కూలీలు

image

గ్రామాల్లో ఉపాధి కరువై పొట్ట కూటి కోసం కూలీలు వలసబాట పట్టారు. బుధవారం పెద్దకడబూరు ఎస్సీ కాలనీకి చెందిన పలువురు కూలీలు కర్ణాటకలోని రాయచూరు జిల్లా గబ్బూరు మండలం హనుమాపురంలో పత్తి తీయడానికి టెంపోలో బయలుదేరారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు గ్రామంలో సాగు చేసిన పత్తి పంట పూర్తిగా దెబ్బతినడంతో పనులు కరువయ్యాయి. దీంతో చేసేది లేక పిల్లా పాపలతో కూలీలు వలస బాట పట్టారు.

News October 23, 2025

తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: ఆర్డీవో

image

రాబోయే తుఫాన్ నేపథ్యంలో తుంగభద్ర నదికి ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు ఆర్డీవో సందీప్ బుధవారం సూచించారు. కర్నూలు రూరల్ మండలంలో 11, సి.బెళగల్ మండలంలో 9 గ్రామాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు. వరద కారణంగా ఏవైనా ఇబ్బందులు కలిగితే ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన టోల్ ఫ్రీ 08518-241380 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.