News August 10, 2024

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా హేమలత

image

అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ప్రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గుజ్జుల హేమలత ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2024-25 ఏడాదికి సంబంధించి ఆరో తేదీ ఎన్నికలు నిర్వహించగా శుక్రవారం ఫలితాలు ప్రకటించారు. ఏపీ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ అనంతపురం జిల్లా శాఖ ఆర్థిక కార్యదర్శిగా ఉన్న హేమలతను జాయింట్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Similar News

News November 18, 2025

అర్జీలు త్వరగా పరిష్కరిస్తాం: అనంత కలెక్టర్

image

అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై అర్జీదారుల నుంచి జిల్లా కలెక్టర్ ఆనంద్ అర్జీలను స్వీకరించారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి త్వరలోనే పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. సమస్యల పరిష్కారంపై నిరంతర సమీక్ష ఉంటుందన్నారు.

News November 17, 2025

అనంతపురం: పోలీసుల PGRSకు 83 పిటిషన్లు.!

image

అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం అర్బన్ DSP శ్రీనివాసరావు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా SP ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి 83 పిటీషన్లు వచ్చాయి. పిటిషనర్లతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.