News February 26, 2025
ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో అతిరుద్ర మహా యజ్ఞానికి చోటు

ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఈనెల 14 నుంచి 25 వరకు జరిగిన అతిరుద్ర మహా యజ్ఞం ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించింది. దాదాపు 83 దేశాలకు చెందిన శ్రీ సత్యసాయి భక్తులు లక్షలాదిమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా అతిరుద్ర మహా యజ్ఞాన్ని తిలకించారని నిర్వాహకులు తెలిపారు. సత్య సాయి ట్రస్టు సభ్యులకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించిన పుస్తకాన్ని నిర్వాహకులు అందజేశారు.
Similar News
News December 24, 2025
ప.గో: నేడు స్వగ్రామానికి జవాన్ రాజశేఖర్ భౌతికకాయం

విధి నిర్వహణలో మరణించిన పెనుమంట్ర(M) పొలమూరుకు చెందిన జవాన్ రాజశేఖర్ అంత్యక్రియలు బుధవారం సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఆయన భౌతికకాయాన్ని విజయవాడ నుంచి ప్రత్యేక వాహనంలో ఉదయం 10 గంటలకు వడలి, పెనుగొండ, మార్టేరు మీదుగా భారీ ర్యాలీతో స్వగ్రామానికి తీసుకురానున్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఈ వీర జవాన్‌కు తుది నివాళి అర్పించేందుకు అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు.
News December 24, 2025
RITES లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News December 24, 2025
ఏటా నాలుగుసార్లు ఓటర్ల నమోదు

AP: గ్రామ పంచాయతీ ఓటర్ల లిస్టును ఏటా 4 సార్లు సవరణ చేసుకునేలా పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చింది. దీనికి గవర్నర్ జస్టిస్ నజీర్ ఆమోదం తెలపడంతో తాజాగా కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులిచ్చింది. గతంలో ఏటా JAN 1 నాటికి ఓటర్ల జాబితాలో నమోదు, మార్పులు చేసుకునే అవకాశం ఉండేది. ఇకపై APR 1, జులై 1, OCT 1న కూడా రివిజన్ చేసుకోవచ్చు. దీంతో 18 ఏళ్ల యువత ఎప్పుడైనా పేర్లను నమోదు చేసుకోవచ్చు.


