News July 21, 2024

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో టెక్కలి విద్యార్థినికి చోటు

image

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో టెక్కలి సమీపంలోని ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ (ఈసీఈ) 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని వర్షప్రియకు చోటుదక్కింది. ఈ మేరకు కళాశాల యాజమాన్యం శనివారం వివరాలు వెల్లడించింది. 17.15 నిమిషాలలో పెన్సిల్ కొన మీద 26 అక్షరాలు చెక్కినందుకు గాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించినట్లు తెలిపారు. యువతిని ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.

Similar News

News October 8, 2024

దళారులను నమ్మి మోసపోవద్దు: మంత్రి

image

మద్యం దుకాణాలకు ఎవరైనా, ఎక్కడి నుంచైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రప్రభుత్వం మద్యం విధానంపై రాజీపడే పడే ప్రసక్తే లేదన్నారు. వ్యాపారులు, ఆశావాహులు ఎవరైనా స్వేచ్ఛగా మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దన్నారు.

News October 8, 2024

శ్రీకాకుళం: ‘సముద్రతీరానికి తీసుకెళ్లి అత్యాచారం’

image

ఓ వ్యక్తిపై పోక్సో కేసు నమోదైన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. SI రంజిత్ తెలిపిన వివరాలు.. పోలాకి మండలానికి చెందిన బాలికతో నరసన్నపేట మండలం రావులవలసకు చెందిన డొంకాన రాముకు పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో బాలికను ఆదివారం పోలాకిలోని సముద్రతీరానికి తీసుకెళ్లాడు. ఇంటికొచ్చాక తల్లి ప్రశ్నించగా విషయం బయటపడింది. కుమార్తెపై అత్యాచారం జరిగినట్లు SPకి ఫిర్యాదుచేసింది. రాముపై పోక్సో కేసు నమోదుచేసినట్లు చెప్పారు.

News October 8, 2024

ఎచ్చెర్ల: రైల్వే లైన్ ఏర్పాటు చేయాలి: ఎంపీ

image

విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను ఒడిశా రాష్ట్రాన్ని కలుపుతూ నూతన రైల్వే లైన్ ఏర్పాటుకై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఎచ్చెర్ల నాయకులు, VZM ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం సౌత్ రీజియన్‌లో ఉన్న రైల్వే సమస్యలను ఆయన వద్ద ప్రస్తావించారు. ఎంపీతో పాటుగా
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ ఉన్నారు.