News February 1, 2025

ఇండోనేషియా అమ్మాయితో గుండ్రాంపల్లి యువకుడు పెళ్లి

image

చిట్యాల మండలం గుండ్రాంపల్లికి చెందిన అబ్బాయి ఇండోనేషియాకు చెందిన అమ్మాయి హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. గ్రామానికి చెందిన సీమ సాలయ్య-యాదమ్మల కుమారుడు నాగరాజు హైదరాబాద్లోని సాప్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇండోనేషియాకి చెందిన రిక్కి సన్డా సెఫిట్రి అదే కంపెనీలో పనిచేస్తోంది. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారి.. ఇటీవల బంధువులు సమక్షంలో ఒక్కటయ్యారు.

Similar News

News November 3, 2025

బాధితులకు సత్వరమే న్యాయం జరగాలి: ఎస్పీ

image

పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఎస్పీ సతీష్ కుమార్ గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని ప్రజలు పలు సమస్యలపై ఎస్పీకి 72 అర్జీలు సమర్పించినట్లు ఆయన కార్యాలయ సిబ్బంది వివరాలు వెల్లడించారు. కుటుంబ కలహాలు, మోసాలు, భూ ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు తదితర సమస్యలపై అర్జీలు వచ్చాయన్నారు. అర్జీదారులకు సత్వరమే న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.

News November 3, 2025

మేడ్చల్ కలెక్టరేట్‌లో ప్రజావాణి

image

పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఐఎఫ్‌టీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం శామీర్‌పేట్‌ పరిధి అంతాయిపల్లిలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఇందిరమ్మ ఇళ్లు తదితర సమస్యలు పరిష్కరించాలని, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లేలా చూడాలని కోరారు.

News November 3, 2025

మల్లె తోటల్లో ఆకులు రాల్చడం.. దేని కోసం?

image

మల్లె తోటల్లో మంచి దిగుబడి కోసం.. నవంబర్ నుంచి చెట్లకు నీరు పెట్టకుండా ఆకులు రాలేటట్లు చేయాలి. అలాగే కొందరు రైతులు మల్లె తోటల్లో గొర్రెలను మంద కడతారు. దీని వల్ల గొర్రెలు ఆకులను తింటాయి. ఫలితంగా మొక్కలకు కొత్త చిగుర్లు వస్తాయి. అలాగే గొర్రెల ఎరువు వల్ల కూడా భూసారం పెరుగుతుంది. తర్వాత కొమ్మ కత్తిరింపులు చేపట్టాలి. కొమ్మలను కత్తిరించడానికి 10 నుంచి 15 రోజుల ముందు నుంచి నీరు కట్టడం ఆపేయాలి.