News March 7, 2025
ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్లో వరంగల్ ఏసీపీ తనిఖీ

వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ శుక్రవారం ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఫిర్యాదులు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులతో ఏసీపీ ముచ్చటించడంతో పాటు వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇటీవల పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులు, వాటి పై ఇన్స్పెక్టర్ షూకూర్ను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News December 1, 2025
ఆసిఫాబాద్ జిల్లాలో నిలిచిన మీసేవ సేవలు

జిల్లాలోని మీసేవ కేంద్రాల్లో రెండు రోజులుగా సర్వర్ పనిచేయకపోవడంతో పౌర సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం కేంద్రాలకు వచ్చిన లబ్ధిదారులు గంటల తరబడి వేచి ఉండి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా స్థానిక ఎన్నికలు, విద్యా సంబంధిత అవసరాల కోసం వచ్చిన వారు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే సర్వర్ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
News December 1, 2025
గద్వాల్: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు విజయవంతం చేయాలి

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈనెల 3వ తేదీన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఇండోర్ స్టేడియంలో ఉదయం11;00 గంటలకు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు. ఆ రోజు వివిధ శాఖలచే ప్రతిపాదించబడిన దివ్యాంగ ఉద్యోగులను సత్కరించటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దివ్యంగులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.
News December 1, 2025
నార్నూర్: ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

నార్నూర్ మండలంలోని ఉమ్రి గ్రామ వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరేసుకొని జాదవ్ నరేష్ (18) ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్సై గణపతి తెలిపారు. జైనూర్ మండలం అందుగూడకు చెందిన సునీత, అన్నాజీ దంపతుల కుమారుడు నరేష్ నాలుగేళ్లుగా పాలేరుగా పని చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో వెళ్లి చూడగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.


