News June 19, 2024
ఇందల్వాయి: అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య
అప్పుల బాధతో యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇందల్వాయి మండలంలో జరిగింది. ఎస్ఐ మనోజ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని త్రియంబకపేట్ గ్రామానికి చెందిన బైరీ గణేశ్ (22) ఏడాది క్రితం బతుకుదెరువుకు సౌదీ వెళ్ళాడు. అక్కడ 6నెలలు గడిపి సరైన ఉపాధి అవకాశాలు దొరక్క తిరిగి ఇంటికి వచ్చాడు. అప్పులు అధికమవడంతో మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.
Similar News
News January 21, 2025
NZB: జిల్లా జడ్జిని కలిసిన రైతు కమిషన్ సభ్యులు
నిజామాబాద్ నగరంలోని జిల్లా జడ్జి సునీత కుంచాలను ఆమె కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం పూల బొకే అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వర్ రెడ్డి, ఆకుల రమేష్ న్యాయవాదులు పాల్గొన్నారు.
News January 21, 2025
NZB: పోగొట్టుకున్న బంగారాన్ని అప్పగించిన పోలీసులు
పోగొట్టుకున్న బంగారాన్ని బాధితుడికి అప్పగించినట్లు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలిపారు. సోమవారం డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వ్యక్తికి ష్యూరిటీ కోసం జనార్దన్ స్టేషన్కు వెళ్లాడు. ఆ సమయంలో అతను 3 గ్రాముల బంగారాన్ని పోగొట్టుకున్నాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫైజుద్దీన్కి బంగారం దోరకడంతో మంగళవారం జనార్దన్కు ట్రాఫిక్ సీఐ అందజేశారు. నిజాయితీని చాటుకున్న కానిస్టేబుల్ను సీఐ అభినందించాడు.
News January 21, 2025
NZB: సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ: కలెక్టర్
సంక్షేమ పథకాలు అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పష్టం చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇందల్వాయి మండలం లోలం గ్రామంలో మంగళవారం నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తదితర పథకాల కోసం అర్హత కలిగిన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.