News February 26, 2026
ఇందల్వాయి: 9 నెలల గర్భిణిని హత్య చేసిన భర్త

ఇందల్వాయి మండలం గన్నారంలో 9 నెలల నిండు గర్భిణిని కట్టుకున్న భర్తే గొంతు నులిమి హత్య చేశాడు. డిచ్‌పల్లి సీఐ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. గన్నారం గ్రామానికి చెందిన నాగేశ్ పది సంవత్సరాల క్రితం సుమలత(31)ను పెళ్లి చేసుకున్నాడు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అనుమానంతో తరచూ నాగేశ్ భార్యతో గొడవ పడేవాడు. ఈ నెల 22న అర్ధరాత్రి భార్యను హత్య చేశాడు.
Similar News
News April 13, 2026
IPL తరహాలో గుంతకల్లులో క్రికెట్ టోర్నమెంట్

గుంతకల్లులోని పాతగుంతకల్లులో ఐపీఎల్ తరహాలో ఓల్డ్ గుంతకల్ ప్రీమియర్ లీగ్ (ఓజీపీఎల్) క్రికెట్ టోర్నమెంట్ జరగనుంది. ఐపీఎల్ తరహాలోనే టీం సెలక్షన్, ప్లేయర్స్ యాక్షన్ జరిగింది. ఆదివారం జరిగిన ప్లేయర్స్ యాక్షన్‌లో పలువురు పాతగుంతకల్లు యువకులు పాల్గొన్నారు. షాడో బ్లాస్టర్స్, సిడ్నీ సిక్సర్స్, కిట్టు స్మాషర్స్, రాయల్ స్ట్రైకర్స్, ఛాంపియన్ చేజర్స్ టీమ్స్ ఉన్నాయి. త్వరలోనే టోర్నీ ప్రారంభంకానుంది.
News April 13, 2026
పార్వతీపురం జిల్లాలో 42 మందిపై కేసులు నమోదు: ఎస్సీ

పార్వతీపురం మన్యం జిల్లాలో ఆదివారం పోలీస్ అధికారులు ప్రత్యేక డ్రంక్ & డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 42 మందిపై కేసులు నమోదు చేశారు. మైనర్లు వాహనాలు నడపడం నేరమని, వారికి వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపైనే చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి హెచ్చరించారు. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే రూ.10 వేల జరిమానా, జైలు శిక్ష విధించబడుతుందని తెలిపారు.
News April 13, 2026
ఇరాన్ పోర్టులను దిగ్బంధిస్తాం: అమెరికా

అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఇరాన్ పోర్టుల్లోకి వెళ్లే, వచ్చే అన్ని నౌకలను దిగ్బంధిస్తామని US సైన్యం ప్రకటించింది. ‘ఏప్రిల్ 13న 10AM(US టైం ప్రకారం)కు ఇది మొదలవుతుంది. ఇరాన్ పోర్టులు, దాని తీర ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించే అన్ని దేశాల నౌకలకు వర్తిస్తుంది. ఇరానేతర ఓడరేవులకు వెళ్లే, హార్ముజ్ జలసంధి గుండా వచ్చే ఇతర నౌకలకు ఆటంకం కలిగించబోం’ అని ట్వీట్ చేసింది.


