News February 26, 2026

ఇందల్వాయి: 9 నెలల గర్భిణిని హత్య చేసిన భర్త

image

ఇందల్వాయి మండలం గన్నారంలో 9 నెలల నిండు గర్భిణిని కట్టుకున్న భర్తే గొంతు నులిమి హత్య చేశాడు. డిచ్‌పల్లి సీఐ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. గన్నారం గ్రామానికి చెందిన నాగేశ్ పది సంవత్సరాల క్రితం సుమలత(31)ను పెళ్లి చేసుకున్నాడు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అనుమానంతో తరచూ నాగేశ్ భార్యతో గొడవ పడేవాడు. ఈ నెల 22న అర్ధరాత్రి భార్యను హత్య చేశాడు.

Similar News

News April 18, 2026

నెల్లూరు: విషాదం.. ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

image

లింగసముద్రం (M)లో విషాద ఘటన చోటుచేసుకుంది. జంపాలవారిపాలానికి చెందిన ఏడో తరగతి విద్యార్థి గడ్డం వినయ్ బాబు స్నేహితులతో కలిసి జంగారెడ్డిపాలెం సమీపంలోని చెక్‌డ్యాం వద్ద ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. SI రాంబాబు దర్యాప్తు చేపట్టారు. శనివారం మృతదేహాన్ని చెక్‌డ్యాం నుంచి వెలికి తీసి పోస్టుమార్టం కోసం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు.

News April 18, 2026

బాలయ్య-కొరటాల కాంబోలో సినిమా?

image

నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో సినిమా రానున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో తీస్తున్న సినిమా షూటింగ్‌లో బాలయ్య బిజీగా ఉండగా.. ఇది పూర్తయ్యాక కొరటాల ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు సరిపడే పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను కొరటాల సిద్ధం చేశారని, ‘దేవర-2’కి ముందే ఇది రాబోతుందని సమాచారం.

News April 18, 2026

KNR: నేడు ఎలగందల్ కోటలో ఉచిత ప్రవేశం

image

కరీంనగర్ జిల్లాలో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఎలగందల్ కోటను సందర్శించాలని భావిస్తున్న వారికి అధికారులు శుభవార్త తెలిపారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా నేడు కోటను సందర్శించే వారికి ఉచిత ప్రవేశాన్ని కల్పించారు. ఈ ప్రత్యేక అవకాశాన్ని ఉపయోగించుకొని కోటను సందర్శించుకోవాలని పర్యాటకులకు అధికారులు సూచించారు. ఎలగందల్ కోట తన వైభవమైన చరిత్ర, అద్భుత నిర్మాణ శైలితో ప్రసిద్ధి చెందింది.