News February 26, 2026

ఇందల్వాయి: 9 నెలల గర్భిణిని హత్య చేసిన భర్త

image

ఇందల్వాయి మండలం గన్నారంలో 9 నెలల నిండు గర్భిణిని కట్టుకున్న భర్తే గొంతు నులిమి హత్య చేశాడు. డిచ్‌పల్లి సీఐ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. గన్నారం గ్రామానికి చెందిన నాగేశ్ పది సంవత్సరాల క్రితం సుమలత(31)ను పెళ్లి చేసుకున్నాడు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అనుమానంతో తరచూ నాగేశ్ భార్యతో గొడవ పడేవాడు. ఈ నెల 22న అర్ధరాత్రి భార్యను హత్య చేశాడు.

Similar News

News April 13, 2026

రాప్తాడు సమీపంలో ప్రమాదం.. 6ఏళ్ల బాలుడి మృతి

image

రాప్తాడు మండలం మరూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల బాలుడు గగన్ మృతి చెందాడు. పెద్దపప్పూరు మండలం సోమనపల్లికి చెందిన మమత తన కుమారుడు, తమ్ముడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో గగన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తల్లితో పాటు తమ్ముడు మారుతీకి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 13, 2026

నేడే SKLM-TPT హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు పరుగులు

image

శ్రీకాకుళం జిల్లా నుంచి నేరుగా తిరుపతికి వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఇటీవల రైల్వే శాఖ శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. ఆమదాలవలస(శ్రీకాకుళం రోడ్డు)రైల్వే స్టేషన్-తిరుపతికి నడిచే హంసఫర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను కేంద్రమంత్రి రామ్మోహన్ ఇవాళ మధ్యాహ్నం 2-15ని.లకు ప్రారంభించనున్నట్లు ఆ కార్యాలయం నుంచి నిన్న ఓ ప్రకటన వచ్చింది. ఈ డైరెక్ట్ ట్రైన్ సర్వీస్‌కు ఎదురుచూస్తున్న జిల్లా వాసుల కల సాకారమవ్వనుంది.

News April 13, 2026

స్మార్ట్ గవర్నెన్స్.. సింగపూర్‌కు 9 మంది మంత్రులు

image

AP: ప్రజలకు స్మార్ట్ గవర్నెన్స్‌ను అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా 9 మంది మంత్రులు, ఉన్నతాధికారులకు ట్రైనింగ్ ఇప్పించనుంది. ఈ నెల 21 నుంచి 27 వరకు నారాయణ, అచ్చెన్న, నాదెండ్ల, సత్యకుమార్, అనగాని, నిమ్మల, పయ్యావుల, అనిత, జనార్దన్ సింగపూర్‌లో పర్యటించనున్నారు. రోజుకొక అంశంపై వారం రోజులపాటు శిక్షణ ఉంటుంది. వారు తిరిగొచ్చాక ఇతర ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పిస్తారు.