News April 17, 2025
ఇందిరమ్మ ఇండ్లకు అర్హుల ఎంపికలో మార్గదర్శకాలు పాటించాలి: అదనపు కలెక్టర్

ఇందిరమ్మ ఇండ్లకు అర్హుల ఎంపికలో తప్పనిసరిగా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎ.వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లాలో చేయూత పింఛన్లు, రాజీవ్ యువ వికాసం, తాగునీటి సరఫరా, ఇందిరమ్మ ఇండ్లు, తదితర అంశాలపై వివిధ శాఖల జిల్లా అధికారులతో పాటు ఎంపీడీవోలు, ఎంపీవోలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
Similar News
News December 13, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహుడి ఖజానాకు రూ. 4.27 లక్షలు

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి శనివారం భక్తుల నుంచి భారీగా ఆదాయం సమకూరింది. టికెట్ల విక్రయాలు, ప్రసాదాల విక్రయాలు, అన్నదానం సేవ ద్వారా ఆలయానికి మొత్తం రూ. 4,27,073/- ఆదాయం నమోదైంది. ఇందులో టికెట్ల ద్వారా రూ. 2,30,514/-, ప్రసాదాల ద్వారా రూ. 1,52,140, అన్నదానం సేవ ద్వారా రూ.44,419/- ఆదాయం వచ్చింది. భక్తుల సహకారంతోనే ఆలయ సేవలు నిరంతరం కొనసాగుతున్నాయని ఆలయ అధికారులు తెలిపారు.
News December 13, 2025
వెల్గటూర్: స్నానానికి వెళ్లి గల్లంతైన వ్యక్తి మృతి

వెల్గటూర్ మండలం కోటిలింగాల వద్ద గోదావరి నదిలో శనివారం గోలెం మల్లయ్య (53) అనే వ్యక్తి గల్లంతై మృతి చెందాడు. గొల్లపల్లి మండలం గంగాపూర్ గ్రామంలో అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తూ స్నానం కోసం నదిలోకి దిగిన మల్లయ్య ఈదుతూ లోతుకు వెళ్లి శక్తి సరిపోక మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టి గంటపాటు శ్రమించి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
News December 13, 2025
VZM: ఉమ్మడి జిల్లాలో 9,513 కేసుల పరిష్కారం

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మొత్తం 9,513 కేసులు రాజీ మార్గంలో పరిష్కారమయ్యాయి. ఈ లోక్ అదాలత్‌లో సివిల్ 424, క్రిమినల్ 9,028, ప్రీ-లిటిగేషన్ 61 కేసులు పరిష్కారమయ్యాయని సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత తెలిపారు. మోటార్ ప్రమాద బీమా కేసులో పిటిషనర్‌కు రూ.90 లక్షల పరిహారం అందజేశారు.


