News March 29, 2025
ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ వేగవంతం చేయాలి: మంత్రి పొంగులేటి

పైలట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని, బేస్మెంట్ పూర్తయిన ఇళ్లకు తక్షణమే చెల్లింపులు జరపాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో వరంగల్ స్మార్ట్ సిటీ పనులు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంశాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు.
Similar News
News December 1, 2025
నిర్ణీత వ్యవధిలో సమస్యలు పరిష్కారం: సబ్ కలెక్టర్

నూజివీడు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించారు. సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మీకోసం కార్యక్రమంలో ప్రజల నుంచి అందించే అర్జీలలోని సమస్యలను నిర్ణయిత వ్యవధిలో పరిష్కరించాలని సూచించారు. అన్ని శాఖలకు చెందిన అధికారులు సకాలంలో హాజరు కావాలన్నారు.
News December 1, 2025
MBNR: అభ్యర్థుల్లో టెన్షన్.. ఆల్ఫాబెటికల్ ప్రకారం గుర్తులు!

సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం ముగియడంతో, ఇప్పుడు గుర్తుల కేటాయింపుపై అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఎన్నికల అధికారులు అభ్యర్థుల పేర్ల ఆల్ఫాబెటికల్ క్రమం ప్రకారం గుర్తులు కేటాయించనున్నారు. ఓటర్లకు సులభంగా అర్థమయ్యే సాధారణ గుర్తులు వస్తే బాగుంటుందని, లేదంటే ఇబ్బంది కలుగుతుందని అభ్యర్థులు భావిస్తున్నారు.
News December 1, 2025
భయపెడుతున్న పురుగు.. రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు

AP: రాష్ట్రంలో <<18409601>>స్క్రబ్ టైఫస్<<>> వ్యాధి కేసులు కలకలం రేపుతున్నాయి. చిత్తూరు, కాకినాడ, విశాఖలో 500కు పైగా కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ లక్షణాలతో విజయనగరంలో మహిళ మరణించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జ్వరం, వాంతులు, అలసట, దగ్గు లాంటి లక్షణాలు ఉంటాయని ఫీవర్ తగ్గకపోతే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఇది అంటు వ్యాధి కాదని వైద్యులు తెలిపారు.


