News August 7, 2024

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరలోనే ప్రారంభం: భట్టి

image

ఈ ఏడాదిలోనే 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని నిర్ణయించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కొద్ది రోజుల్లోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రూ.5 లక్షల వ్యయంతో రెండు గదుల ఇందిరమ్మ ఇళ్ల పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీలకు మరో లక్ష అదనంగా కలిపి రూ.6 లక్షలు ఇస్తామని వివరించారు.

Similar News

News November 17, 2025

పొగమంచులో నెమ్మదిగా వెళ్లండి: సీపీ

image

శీతాకాలంలో చలి, పొగమంచు తీవ్రత పెరిగినందున వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు. పొగమంచు వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, వాహనదారులు లైటింగ్ కండిషన్ చూసుకోవాలని, తక్కువ వేగంతో ఒకే లైన్‌లో ప్రయాణించాలని, ఓవర్ టేక్ చేయవద్దని ఆయన సూచించారు. సురక్షిత ప్రయాణం కోసం జాగ్రత్తలు పాటించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించాలి: అదనపు కలెక్టర్లు

image

ఖమ్మం కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డా. పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. పుట్టకోట మహిళలు కోరిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల విషయంలో ఆర్డీఓ, హౌసింగ్ అధికారులకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముదిగొండ వల్లభి యువత కోరిన విధంగా గ్రంథాలయాన్ని పునరుద్ధరించాలని సూచించారు. అర్జీలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.