News March 16, 2025
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నాణ్యతగా ఉండాలి: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నాణ్యతగా ఉండాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. పటాన్ చెరు మండలం రామేశ్వరం మండలం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను శనివారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల ద్వారా శిక్షణ పొందిన మహిళా మేస్త్రిలు ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు అయ్యేలా చూడాలని చెప్పారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ చలపతి, తహశీల్దార్ రంగారావు పాల్గొన్నారు.
Similar News
News March 16, 2025
కోహ్లీ.. ఆ ఒక్క సెంచరీ చేస్తే

భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్నారు. ఐపీఎల్‌లో మరో సెంచరీ చేస్తే టీ20 ఫార్మాట్‌లో 10 శతకాలు చేసిన తొలి భారత ప్లేయర్‌గా నిలవనున్నారు. ఆ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ(8) ఉన్నారు. కోహ్లీ IPLలోనే 8 సెంచరీలు, అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక సెంచరీ చేశారు. ఓవరాల్‌గా టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ల జాబితాలో గేల్(22), బాబర్(11) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
News March 16, 2025
ASF: బాధ్యతలు స్వీకరించిన ధోని శ్రీశైలం

ఆసిఫాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) జిల్లా అధ్యక్షుడిగా ధోని శ్రీశైలం రెండో సారి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన్ను పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీశ్ బాబు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని ఉన్నత స్థాయిలో బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్యామ్ సుందర్, శ్రీనివాస్, రఘునాథ్, తదితరులున్నారు.
News March 16, 2025
అన్నమయ్య: చింత చెట్టుపై నుంచి పడి రైతు మృతి

చింతకాయలు కోయడానికి చెట్టు ఎక్కిన ఓ రైతు ప్రమాదవశాత్తు కింద పడి మృత్యువాత పడ్డాడు. ఆదివారం సాయంత్రం పీటీఎం మండలంలో వెలుగు చూసిన ఘటనపై మృతుని కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని కందుకూరు పంచాయతీ, గొడుగువారిపల్లికి చెందిన రైతు కొత్తోల్ల వెంకటరమణ(55) ఊరికి సమీపంలో ఉన్న చింతచెట్టు ఎక్కి కాయలు కోస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు పైనుంచి కింద పడి మృతి చెందాడని కుటుంబీకులు తెలిపారు.