News March 19, 2025

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలి: వనపర్తి కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికైన లబ్ధిదారులందరూ ఈ నెలాఖరులోపు ఇళ్ల నిర్మాణం ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో వెబ్ఎక్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఎంపికైన 15 గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణం ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలను ఆదేశించారు.

Similar News

News November 27, 2025

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు: చంద్రబాబు

image

AP: పంటలన్నింటికీ గిట్టుబాటు ధరలు దక్కేలా చూడాలని వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు అన్నారు. పత్తి, అరటి, జొన్న వంటి పంటలు సాగు చేసే రైతులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరగకూడదని, 2 రోజుల్లో చెల్లింపులు చేయాలన్నారు. వర్షాలు ఉంటాయనే హెచ్చరికల నేపథ్యంలో రైతులకు గోనె సంచులు అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

News November 27, 2025

ములుగు: పంచాయతీ పోరులో తాజా ‘మాజీ’లు

image

ములుగు జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాజా మాజీ సర్పంచులు సన్నద్ధమవుతున్నారు. ఇందులో గతంలో కాంగ్రెస్ మద్ధతు దారులుగా గెలుపొందిన వారు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో సర్పంచులుగా గెలిచి తమ గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చని అంటున్నారు. రిజర్వేషన్ కలిసి రానిచోట ఆత్మీయులను బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

News November 27, 2025

ASF: అండర్ – 14 బాక్సింగ్‌కి 8 మంది విద్యార్థుల ఎంపిక

image

ఆసిఫాబాద్ జిల్లాలో అండర్–14 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బాక్సింగ్ సెలక్షన్స్ నిర్వహించి జోనల్ స్థాయికి 8 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. షేక్ అబ్దుల్ అజాం, విక్రం తేజ, వివేక్, ప్రేమ్ రక్షిత్, అశ్విత్ తేజ, సిద్దు, చక్రపాణి, వినయ్ ఎంపికయ్యారు. విద్యార్థులను జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు.