News March 19, 2025
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలి: వనపర్తి కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికైన లబ్ధిదారులందరూ ఈ నెలాఖరులోపు ఇళ్ల నిర్మాణం ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో వెబ్ఎక్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఎంపికైన 15 గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణం ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలను ఆదేశించారు.
Similar News
News April 18, 2025
TTD ఈవో బంగ్లాలో నాగుపాము హల్‌చల్

తిరుపతిలోని టీటీడీ ఈవో శ్యామలరావు బంగ్లాలో రాత్రి నాగుపాము హల్‌చల్ చేసింది. పామును పట్టేందుకు రిటైర్డ్ టీటీడీ ఉద్యోగి రవీందర్ నాయుడును తీసుకు వచ్చారు. ఆయన పామును పట్టి గొనె సంచెలో వేస్తుండగా చేతిపై కాటేసింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆయనను స్విమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం రవీందర్ నాయుడు కోలుకుంటున్నారు.
News April 18, 2025
IPL: CSKలోకి బేబీ ABD?

సౌతాఫ్రికా క్రికెటర్ డెవాల్డ్ బ్రెవిస్ ఇన్‌స్టాలో యెల్లో కలర్ ఇమేజ్‌ను పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. అతడు IPLలో CSK జట్టులో చేరనున్నారా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఇప్పటికే పలువురు CSK అభిమానులు సోషల్ మీడియా వేదికగా బ్రెవిస్‌కు స్వాగతం చెబుతున్నారు. అయితే అతడు నిజంగానే CSKలో చేరుతారా? మరేదైనా విషయమా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. బేబీ ఏబీగా పాపులరైన బ్రెవిస్ గతంలో MIకి ఆడారు.
News April 18, 2025
గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు చేయాలి: కవిత

TG: గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దు చేసి పరీక్షను మళ్లీ నిర్వహించాలని సీఎం రేవంత్‌కు ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందని అన్నారు. గ్రూప్-1 పరీక్ష నిర్వహించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగుల జీవితాలు అగాధంలోకి పడిపోయాయని పేర్కొన్నారు. పరీక్ష నిర్వహించిన తీరు, ఫలితాల వెల్లడిపై అభ్యర్థుల్లో సందేహాలు ఉన్నాయన్నారు.