News April 16, 2025

ఇందిరమ్మ గృహాలకు 300 మంది మార్కింగ్: VKB కలెక్టర్ 

image

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు 300 మంది ఇంటి నిర్మాణానికి మార్కింగ్ చేశారని, 25 మంది బేస్మెంట్ పూర్తి చేశారని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. బేస్మెంట్ పూర్తి చేసుకున్న వారికి అమౌంట్ జమ చేయనున్నట్లు వెల్లడించారు.

Similar News

News February 26, 2026

ఆరోగ్యం కోసం 10 నిమిషాల మార్నింగ్ రొటీన్‌

image

ఉదయాన్నే 10 నిమిషాలు కేటాయించి డైజెషన్, నాడీ వ్యవస్థను మెరుగుపరుచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. తొలుత 3 నిమిషాలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. తర్వాత 3 నిమిషాల పాటు స్ట్రెచింగ్స్ లేదా నడకతో గట్ మొబిలిటీ మెరుగుపడుతుంది. 2 నిమిషాల పాటు గోరువెచ్చని నీరు తాగితే బాడీ రీహైడ్రేట్ అవుతుంది. మరో 2 ని.లు ఎలాంటి స్ట్రెస్ లేకుండా టిఫిన్ చేయడానికి ముందు ప్రశాంతంగా ఉండాలి.

News February 26, 2026

కోదాడ: కర్ల రాజేష్ మృతదేహానికి రీ పోస్ట్‌మార్టం

image

పోలీస్ లాకప్‌లో మృతి చెందిన కోదాడకు చెందిన కర్ల రాజేష్ మృతదేహానికి ఈ నెల 27న రీ-పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఎంఆర్‌పీఎస్ ఆందోళనలు, జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వైద్య బృందం ఆధ్వర్యంలో కోదాడలో ఈ ప్రక్రియ జరగనుంది.

News February 26, 2026

అల్లూరి: గంజాయి నిర్మూళనకు ‘ఆపరేషన్ సంయుక్త’

image

విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి ఆధ్వర్యంలో జరిగిన అంతర్రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల వీడియో కాన్ఫరెన్స్‌లో అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ పాల్గొన్నారు. ఏజెన్సీలో గంజాయి ‘జీరో కల్టివేషన్’ సాధించిన విధానాన్ని ఒడిశా అధికారులకు వివరించారు. సరిహద్దుల్లో అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఉమ్మడిగా ‘ఆపరేషన్ సంయుక్త’ చేపట్టాలని నిర్ణయించారు.