News January 29, 2025
ఇందిరా మహిళా శక్తి పథకం బలోపేతానికి చర్యలు

ఇంరిరా మహిళ శక్తి పథకంబలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మెప్మా పీడీ ఇందిర తెలిపారు. మెదక్ పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో మెప్మా సిబ్బంది, జిల్లా రిసోర్స్ పర్సన్ పర్సన్తో లింకేజీ, లక్ష్యాలు, సాధించిన ప్రగతి సంబంధిత అంశాలపై సమీక్షించారు. ఇందిరా మహిళ మహిళా పథకం క్రింద మంజూరైన యూనిట్లను బలోపేతం చేసి వాటికి మార్కెటింగ్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
Similar News
News February 21, 2025
మెదక్: మైనర్ బాలికపై లైంగిక దాడి

మైనర్ బాలికపై ఇద్దరు లైంగిక దాడికి పాల్పడిన ఘటన సంగారెడ్డి మండలం ఫసల్వాది పరిధిలోని రెండు పడక గదుల ఇళ్ల సమీపంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఎనిమిది సంవత్సరాల పాపను ఇద్దరు పక్కనే ఉన్న ముళ్లపొదల్లోకి తీసుకెళ్లారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడడంతో తీవ్ర రక్తస్రావమైంది. వారిలో ఒకరిని స్థానికులు పట్టుకొని చితకబాదారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
News February 21, 2025
రామాయంపేట: విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి

ఇంట్లో ఫ్యాన్ రిపేర్ చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రామాయంపేట మండలంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన పొట్టినోళ్ల నర్సింలు(55) అనే వ్యక్తి బుధవారం రాత్రి తన ఇంట్లో ఫ్యాన్ రిపేర్ చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
News February 20, 2025
మెదక్ జిల్లాలో విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల ముందస్తు అరెస్టులు

మెదక్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులను ముందస్తుగా పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులను కన్వర్షన్ (రెగ్యులర్) చేయాలన్న పిలుపుతో ఆర్టిజన్ ఉద్యోగులు చలో హైదరాబాద్ విద్యుత్ సౌదాకు పిలుపునిచ్చారు. యూనియన్ నాయకుల పిలుపుమేరకు చలో విద్యుత్ సౌదా వెళ్లకుండా జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.