News August 7, 2024

ఇందుకూరుపేట కానిస్టేబుల్ మృతి

image

ఇందుకూరుపేట మండలం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ వై కృష్ణ బుధవారం మృతి చెందాడు. ఇటీవల కానిస్టేబుల్ కృష్ణ ప్రమాదానికి గురయ్యారు. రోడ్డు ప్రమాదానికి గురై గత పది రోజుల నుంచి ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన కుటుంబానికి తోటి మిత్రులు, సన్నిహితులు, కుటుంబ స్నేహితులు, పోలీస్ శాఖ సిబ్బంది ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Similar News

News September 11, 2024

పోలేరమ్మ జాతరకు ఏర్పాట్లను పగడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్

image

ఈనెల 11వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరగనున్న వెంకటగిరి పోలేరమ్మ తల్లి జాతర ఏర్పాట్లను పగడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఆయన మంగళవారం ఎస్పీ సుబ్బారాయుడు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, వీఆర్వో పెంచల కిషోర్ సంబంధిత శాఖల అధికారులు కలిసి ఆయన జాతర ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు.

News September 10, 2024

కోర్టులో లొంగిపోయిన నెల్లూరు మేయర్ భర్త

image

నెల్లూరు కార్పొరేషన్‌లో జరిగిన సంతకాల ఫోర్జరీ అభియోగం కేసులో మేయర్ భర్త జయవర్ధన్ నిందితుడిగా ఉన్నారు. గత కొన్ని రోజులుగా పోలీసులు జయవర్ధన్ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఇప్పటికే ఈ కేసులో టౌన్ ప్లానింగ్ అధికారులను అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. కీలక నిందితుడిగా జయవర్ధన్ మంగళవారం కోర్టులో లొంగిపోయారు. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

News September 10, 2024

సర్వేపల్లి: బాధితులకు పారిశ్రామికవేత్తల భారీ సాయం

image

వరద బాధితులను ఆదుకునేందుకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పారిశ్రామిక వేత్తలు భారీ సాయం ప్రకటించారు. రూ.2.97 కోట్ల విలువైన చెక్కులను సీఎం చంద్రబాబు నాయుడికు మంగళవారం అందజేశారు. జెమిని ఎడిబుల్ ఆయిల్స్ అండ్ ఫాట్స్ కంపెనీ రూ.2 కోట్లు, ఎస్ఈఐఎల్ పవర్ ప్రాజెక్టు ప్రతినిధులు రూ.50 లక్షలు, పలు కంపెనీల ప్రతినిధులు కలిసి రూ.47 లక్షలను అందజేశారు. దాతలకు ధన్యవాదాలు తెలిపారు.