News November 15, 2024
ఇంద్రవెల్లి: ఎక్సైజ్ కానిస్టేబుల్.. జూనియర్ అసిస్టెంట్గా ఎంపిక

ఇంద్రవెల్లి మండలం ఏమాయికుంటకి చెందిన శ్యామ్ రావ్, రేఖ బస్సి దంపతుల కుమార్తె ప్రీతి గ్రూప్ -4 ఫలితాల్లో కొలువు సాధించింది. ఇది వరకే ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో జాయిన్ అయింది. గ్రూప్ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో సెలవు పెట్టి ఉద్యోగానికి సన్నద్ధమైంది. ఎట్టకేలకు గ్రూప్ -4 రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా ఎంపికైంది. దీంతో బంధుమిత్రులు అభినందించారు.
Similar News
News October 24, 2025
ADB: నేటి నుంచి పత్తి విక్రయానికి స్లాట్ బుకింగ్స్ ప్రారంభం

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 4 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేయగా.. ప్రభుత్వం రూ.8,110 మద్దతు ధర ప్రకటించింది. ఈనెల 27 నుంచి సీసీఐ అధికారులు పత్తి కొనుగోలు ప్రారంభించనుండగా ఈ రోజు(24వ తేదీ) నుంచి రైతులు తమ పంట విక్రయించేందుకు కిసాన్ కపాస్ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. నిబంధనల ప్రకారం తేమ శాతం 8 నుంచి 12లోపు ఉంటేనే పత్తి కొనుగోలు చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
News October 24, 2025
ADB: జిల్లాస్థాయి యువజనోత్సవాలకు దరఖాస్తులు

ఆదిలాబాద్ జిల్లా స్థాయి యువజనోత్సవాలను నవంబర్ 4న నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. 15 నుంచి 29 సంవత్సరాల యువత ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు అర్హులని పేర్కొన్నారు. పాటలు, వక్తృత్వం, శాస్త్రీయ నృత్యం, క్విజ్, ఫోక్ సాంగ్స్ వంటి ఏడు అంశాలలో పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి ఉన్నవారు నవంబర్ 3 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని, పోటీలు డీఆర్డీఏ మీటింగ్ హాలులో జరుగుతాయని వివరించారు.
News October 24, 2025
ఆదిలాబాద్: పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

పదో తరగతి ఫైనల్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రకటించిందని DEO ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. అక్టోబరు 30 నుంచి నవంబర్ 13 లోపు పాఠశాల హెడ్మాస్టర్లకు విద్యార్థులు ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. HMలు ఆన్లైన్ ద్వారా నవంబర్ 14 లోపు ఫీజు చెల్లింపు చేయాలని, విద్యార్థుల డేటాను నవంబర్ 18లోపు అందించాలని సూచించారు. రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్ 29 వరకు అవకాశం ఉందన్నారు.


