News November 15, 2024

ఇంద్రవెల్లి: ఎక్సైజ్ కానిస్టేబుల్.. జూనియర్ అసిస్టెంట్‌గా ఎంపిక

image

ఇంద్రవెల్లి మండలం ఏమాయికుంటకి చెందిన శ్యామ్ రావ్, రేఖ బస్సి దంపతుల కుమార్తె ప్రీతి గ్రూప్ -4 ఫలితాల్లో కొలువు సాధించింది. ఇదివరకే ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో జాయిన్ అయింది. గ్రూప్ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో సెలవు పెట్టి ఉద్యోగానికి సన్నద్ధమైంది. ఎట్టకేలకు గ్రూప్ -4 రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్ గా ఎంపికైంది. దింతో బంధుమిత్రులు అభినందించారు.

Similar News

News December 9, 2024

బాసర లాడ్జిలో యువకుడి సూసైడ్

image

బాసరలోని ఓ ప్రైవేటు లాడ్జిలో ఆదివారం ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. SI గణేశ్ వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం సూరారానికి చెందిన రాజేందర్ (25) నిన్న లాడ్జిలో ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. ‘అమ్మా నన్ను క్షమించు, తమ్ముడిని బాగా చూసుకో, నిన్ను చాలా కష్టపెట్టిన, ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ’ సూసైడ్ నోట్‌ను అతడి తమ్ముడి ఫోన్‌కు పంపినట్లు SI వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

News December 9, 2024

రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడిADB జిల్లా జట్ల ప్రతిభ

image

నిజామాబాద్ జిల్లాలోని ఆర్ముర్‌లో మూడు రోజులుగా జరిగిన రాష్ట్రస్థాయి SGFఅండర్-17 సాఫ్ట్ బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలబాలికల జట్లు ప్రతిభ కనబర్చి కాంస్య పతకాలు సాధించాయి. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను SGF సెక్రెటరీలు ఫణిరాజా, వెంకటేశ్వర్, కోచ్, మేనేజర్లు బండి రవి, చంద్ పాషా, రాజ్ మహమ్మద్, కోట యాదగిరి, పలువురు అభినందించారు.

News December 9, 2024

మంచిర్యాల: హీటర్ వాడుతున్నారా.. జాగ్రత్త..!

image

వాటర్ హీటర్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. చిన్న నిర్లక్ష్యం ప్రాణాలను తీస్తుంది. ఆదివారం నెన్నెలకు చెందిన స్వప్న(22) వాటర్ హీటర్ వాడుతుండగా విద్యుత్ షాక్‌తో మృతి చెందింది. హీటర్ ఆన్ చేసి ఉండగా నీటిని తాకవద్దని, హీటర్ స్వీచ్ ఆఫ్ చేసిన తర్వాతే నీటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాగా 5 రోజుల క్రితమే స్వప్న పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుంది. ఆమె మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.