News March 19, 2024
ఇంద్రవెల్లి: గొంతు తడవాలంటే 2KM వెళ్లాల్సిందే..!
ఇంద్రవెల్లి మండలం సాలెగూడ గ్రామస్థులకు తాగు నీరు లేక అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో గిరిజనులు గ్రామంలో ప్రతీ ఇంటి ముందు డ్రమ్ములతో కూడిన ఎడ్లబండ్లే దర్శనమిస్తున్నాయి. నీళ్లు కావాలంటే బండి కట్టాల్సిందేనని.. రోజూ సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని పంట చేల వద్దకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి కోసం పనులు సైతం వదులుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు.
Similar News
News January 1, 2025
భక్తిశ్రద్ధలతో నూతన సంవత్సరానికి స్వాగతం
మంచిర్యాల జిల్లా భీమారంలో అయ్యప్ప పడిపూజ ఘనంగా నిర్వహించారు. కొమ్ము ప్రభాకర్ స్వామి ఇంటి వద్ద అయ్యప్ప స్వామికి వైభవంగా పూజలు నిర్వహించి అభిషేకాలు చేశారు. అయ్యప్ప స్వాములు భజనలతో భక్తులను మంత్రముగ్ధులను చేశారు. డిసెంబర్ 31ని ఇలా భక్తిశ్రద్ధలతో ముగించి నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలకడం చాలా ఆనందంగా ఉందని భక్తులు తెలిపారు.
News January 1, 2025
MNCL: 3న ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ విచారణ
SC వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ప్రతినిధి, రాష్ట్ర హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ జనవరి 3న బహిరంగ విచారణ చేపడతారని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశం ఉంటుందన్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రజల అభిప్రాయాలను బహిరంగ విచారణలో స్వీకరిస్తారని పేర్కొన్నారు.
News December 31, 2024
మంచిర్యాల: రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్న వేళ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని కేజీబీవీ వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి కింద పడిపోయింది. బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు కడెం మెయిన్ కెనాల్లో పడిపోయి మరణించినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాద విషయాల్ని పోలీసులకు చేరవేసినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.