News January 28, 2025
ఇంద్రవెల్లి: నాగోబా జాతరలో నేటి పూజలివే

నాగోబా..ఆదివాసీల ఆరాధ్యదైవం. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన కేస్లాపూర్ జాతర నేడు ప్రారంభం కానుంది. మర్రి చెట్టు వద్దకు మెస్రం వంశీయులు 3రోజులుగా పూజలు నిర్వహించి నేడు నాగోబా మురాడి నుంచి వంశపెద్దలు నాగోబా ప్రతిమలు, పూజా సామగ్రితో శోభాయాత్రగా ఆలయానికి చేరుకున్నారు. 22 కుండలు, దీపాలు పొయ్యిలను మహిళలు కుండల్లో కోనేరు నీటితో పుట్టలు తయారు చేస్తారు. మట్టి ఉండలతో సతీదేవతలో బౌలను తీర్చిదిద్దుతారు.
Similar News
News November 28, 2025
ప్రకృతి వ్యవసాయంతో బహుళ ప్రయోజనం: కలెక్టర్

ప్రకృతి వ్యవసాయం ద్వారా మంచి దిగుబడులు సాధించడంతోపాటు సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. అంబాజీపేట మండలం ముక్కామలలో శుక్రవారం జరిగిన ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయ సాగుపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. దీనివల్ల రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటలక్ష్మి పాల్గొన్నారు.
News November 28, 2025
ప్రకాశం: పొగ మంచు కురుస్తోంది.. జాగ్రత్త.!

ప్రస్తుతం జాతీయ రహదారుల్లో అధికంగా పొగమంచు కురిసే అవకాశం ఉందని, వాహనదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రకాశం జిల్లా పోలీసులు సూచించారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయం సోషల్ మీడియా ద్వారా వాహనదారులు, డ్రైవర్లకు శుక్రవారం పలు సూచనలు జారీ చేసింది. హైవేల్లో రాకపోకలు సాగించే వాహనాలకు కాస్త గ్యాప్తో ప్రయాణించాలన్నారు. అలాగే ట్రాఫిక్ జామ్ సమయాలలో కూడా వాహనాల రద్దీ నేపథ్యంలో జాగ్రత్త వహించాలన్నారు.
News November 28, 2025
స్వామి సన్నిధానాన్ని చేరేందుకు.. కష్టాన్ని కూడా మర్చిపోతారు

శబరిమల యాత్రలో నీలిమల కొండను కఠినమైన సవాలుగా భావిస్తారు. కానీ, అయ్యప్ప నామ స్మరణతో సులభంగా ఈ కొండను ఎక్కేస్తారు. అయితే ఇక్కడి నుంచే భక్తులకు సన్నిధానానికి త్వరగా చేరాలనే ఉత్కంఠ, స్వామివారి దివ్య మంగళ రూపాన్ని చూడాలనే ఆత్రుత మొదలవుతాయట. స్వామి దర్శనం పట్ల ఉండే ఈ అపారమైన భక్తి భావమే ఈ కఠినమైన దారిని సులభంగా దాటేలా చేస్తుందని నమ్మకం. <<-se>>#AyyappaMala<<>>


