News January 28, 2025
ఇంద్రవెల్లి: నాగోబా జాతరలో నేటి పూజలివే

నాగోబా..ఆదివాసీల ఆరాధ్యదైవం. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన కేస్లాపూర్ జాతర నేడు ప్రారంభం కానుంది. మర్రి చెట్టు వద్దకు మెస్రం వంశీయులు 3రోజులుగా పూజలు నిర్వహించి నేడు నాగోబా మురాడి నుంచి వంశపెద్దలు నాగోబా ప్రతిమలు, పూజా సామగ్రితో శోభాయాత్రగా ఆలయానికి చేరుకున్నారు. 22 కుండలు, దీపాలు పొయ్యిలను మహిళలు కుండల్లో కోనేరు నీటితో పుట్టలు తయారు చేస్తారు. మట్టి ఉండలతో సతీదేవతలో బౌలను తీర్చిదిద్దుతారు.
Similar News
News November 15, 2025
గుండెపోటుతో టీచర్ మృతి

అవుకులో ప్రభుత్వ ఉపాద్యాయుడు గుండెపోటుతో మృతి చెందారు. అవుకుకు చెందిన విజయ్ గత డీఎస్సీలో ఉద్యోగం సాధించి పాణ్యం గురుకుల పాఠశాలలో నెలక్రితం ఉద్యోగంలో చేరారు. శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. విజయ్ మృతితో కుటుంబంతో పాటు అవుకులో విషాదం నెలకొంది.
News November 15, 2025
HYD: ఈనెల 17న ‘మీ డబ్బు-మీ హక్కు’ జిల్లా స్థాయి శిబిరం: కలెక్టర్

‘మీ డబ్బు-మీ హక్కు’లో భాగంగా ఈనెల 17న బాగ్ లింగంపల్లిలోని TGSRTC కళ్యాణ మండపం వద్ద జిల్లా స్థాయి శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం ఆదేశాలకు అనుగుణంగా “మీ డబ్బు- మీహక్కు” అనే ఇతివృత్తంతో క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల సమస్యను పరిష్కరించేందుకు జాతీయస్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.
News November 15, 2025
NLG: ఉపాధ్యాయుల్లో ‘టెట్’ టెన్షన్!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉపాధ్యాయులకు టెట్ టెన్షన్ పెరిగింది. పీఈటీలు, పీడీలు మినహా ఇతర ఉపాధ్యాయులంతా రెండేళ్లలో టెట్ అర్హత సాధించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఇన్ సర్వీసు టీచర్లలో ఆందోళన నెలకొంది. పదోన్నతులు, ఉద్యోగ భద్రతపై అనిశ్చితి వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలో సుమారు 5 వేల మందికి టెట్ తప్పనిసరి కావడంతో ఉపాధ్యాయ సంఘాలు మినహాయింపు కోసం ఎన్సీటీఈ, ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.


