News January 24, 2025
ఇంద్రవెల్లి: ‘పాదరక్షలతో వస్తే రూ.5 వేల జరిమానా’

పుష్య మాసం అంటే ఆదివాసీ గిరిజనులకు పవిత్ర మాసం. ఈ మాసంలో నెల రోజుల పాటు ఆదివాసీ గిరిజన గోండులు, కొలాం గిరిజనులు పాదరక్షలు ధరించరు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం తుమ్మగూడ గ్రామ గిరిజనులు తమ గూడెంలోకి ఈ మాసంలో పాదరక్షలు ధరించి రావొద్దని ఏకంగా చెక్ పోస్టును ఏర్పాటు చేశారు. గూడెం వాసులు, బయట వారు కానీ పాదరక్షలతో వస్తే వారికి రూ. 5 వేలు జరిమానా విధించటానికి గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో నిర్వహించారు.
Similar News
News November 27, 2025
భూపాలపల్లి: ‘ఆధార్ సేవలు ప్రజలకు సక్రమంగా అందేలా పని చేయాలి’

ఆధార్ సేవలు ప్రజలకు సక్రమంగా అందేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. గురువారం భూపాలపల్లిలో విద్య, వైద్య, సంక్షేమ తదితర శాఖల అధికారులతో జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పిల్లల బయోమెట్రిక్ అప్‌డేట్లు గడువులోపు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం 5,64,369 మందికి ఆధార్ కార్డులున్నాయన్నారు.
News November 27, 2025
భూపాలపల్లి: ‘Te-Poll మొబైల్ యాప్‌ను ఉపయోగించుకోవాలి’

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సౌకర్యవంతంగా ఎన్నికల సమాచారాన్ని అందించేందుకు రూపొందించిన Te-Poll మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఈ Te-Poll యాప్ ద్వారా ఓటర్లు పోలింగ్ కేంద్ర వివరాలు, ఓటర్ స్లిప్పు నమోదు సమాచారం సులభంగా తెలుసుకో గలుగుతారని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఓటరు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని వినియోగించుకోవాలని కోరారు.
News November 27, 2025
పోలీసు కుటుంబాలకు అండగా గుంటూరు ఎస్పీ

గుంటూరు AR హెడ్ కానిస్టేబుల్ షేఖ్ మొహిద్దిన్ బాషా కుమారుడు షేఖ్ ఆఖ్యార్ అహ్మద్ సాఫ్ట్ టెన్నిస్‌లో దేశస్థాయి పోటీలకు అర్హత సాధించాడు. శ్రీకాకుళంలో అండర్-17 టోర్నమెంట్‌లో ప్రథమ స్థానం సాధించిన అతనికి ఎస్పీ వకుల్ జిందాల్ ప్రోత్సాహకంగా రూ. 20 వేల విలువైన టెన్నిస్ బ్యాట్ అందజేశారు. పోలీసు కుటుంబం నుంచి జాతీయ స్థాయికి చేరడం గర్వకారణమని ఎస్పీ పేర్కొంటూ, భవిష్యత్ విజయాలకు శుభాకాంక్షలు తెలిపారు.


