News April 10, 2025

ఇంద్రవెల్లి: ప్రియుడితో కలిసి భర్తపై గొడ్డలితో దాడి

image

భర్తపై భార్య గొడ్డలితో దాడి చేసిన ఘటన ఇంద్రవెల్లిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గోపాల్‌పూర్‌ వాసులు సాహెబ్ రావ్, ఎల్లవ్వ‌ వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. 4నెలల క్రితం సాహెబ్ రావ్ చిన్నమ్మ కోడుకు దశరథ్ వారి ఇంటికి వచ్చి అక్కడే ఉంటున్నాడు. సాహెబ్ పనినిమిత్తం వేరే ఊరికి వెళ్లడంతో ఎల్లవ్వ, దశరథ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలిసి భర్త మందలించడంతో అతడిని చంపేందుకు యత్నించారు.

Similar News

News March 8, 2026

చిత్తూరు: పెరుగుతున్న చికెన్ ధరలు

image

చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.179 నుంచి రూ.186, మాంసం రూ.260 నుంచి 295 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.295 నుంచి రూ.320వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ. 72 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News March 8, 2026

నల్గొండ: గ్యాస్ సెగ.. సామాన్యుడిపై రూ.70 కోట్ల అదనపు భారం

image

కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచి సామాన్యుడి వంటింట్లో మంటలు రేపింది. డొమెస్టిక్ సిలిండర్‌పై రూ.60, కమర్షియల్ సిలిండర్‌పై రూ.115 చొప్పున పెంచడంతో పేద, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాజా పెంపుతో ఉమ్మడి జిల్లాలోని వినియోగదారులపై ఏడాదికి సుమారు రూ.70 కోట్ల మేర అదనపు భారం పడనుంది. ధరల పెరుగుదలపై జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News March 8, 2026

నల్గొండ: దేశంలోనే అరుదైన దేవాలయం మన దగ్గరే..

image

నల్గొండ జిల్లా అడవిదేవులపల్లిలో కృష్ణానది ఒడ్డున విశిష్టమైన సూర్య దేవాలయం కొలువై ఉంది. దేశంలోనే పడమర దిక్కున ఉన్న ఏకైక సూర్య దేవాలయంగా ఈ ఆలయం గుర్తింపు పొందింది. ఇక్కడ సూర్యాస్తమయ సమయంలో కిరణాలు నేరుగా స్వామివారి పాదాలను తాకడం విశేషం. విశ్వామిత్ర మహర్షి సర్పయాగం చేసిన ఈ ప్రాంతంలో, కాకాసురుని వధ జరిగినందున కాకులు కనిపించవని భక్తుల నమ్మకం. ఈ గుడిని 800 ఏళ్ల క్రితం కల్యాణ చాళుక్యులు నిర్మించారు.