News December 14, 2024

ఇంధన పొదుపుతో భావితరాలకు భరోసా: కలెక్టర్

image

ప్ర‌తి ఒక్క‌రూ సామాజిక బాధ్య‌త‌తో ఇంధ‌న పొదుపు చ‌ర్య‌లు పాటించాలని ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు. భావిత‌రాల‌కు భ‌రోసా క‌ల్పించాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని పేర్కొన్నారు. శ‌నివారం జాతీయ ఇంధన ప‌రిర‌క్ష‌ణ వారోత్స‌వాల సందర్భంగా ప్ర‌త్యేక ర్యాలీని విజ‌య‌వాడలోని క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యం వ‌ద్ద క‌లెక్ట‌ర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడారు. 

Similar News

News December 27, 2024

స‌మ్మిళిత వృద్ధి సాధ‌న‌లో బ్యాంకులు కీల‌క‌పాత్ర పోషించాలి: కలెక్టర్

image

స్వ‌ర్ణాంధ్ర 2047 సాకారం దిశ‌గా అమ‌లుచేస్తున్న ప్ర‌ణాళిక‌లు మంచి ఫ‌లితాలు ఇవ్వ‌డంలో, అన్ని రంగాల్లోనూ 15 శాతం సుస్థిర‌, స‌మ్మిళిత వృద్ధి సాధ‌న‌లో బ్యాంకులు కీల‌క‌పాత్ర పోషించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ కోరారు. శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్‌లో లీడ్ జిల్లా కార్యాల‌యం ఆధ్వ‌ర్యంలో క‌లెక్ట‌ర్ అధ్య‌క్ష‌త‌న జిల్లా సంప్ర‌దింపుల క‌మిటీ, జిల్లాస్థాయి స‌మీక్షా క‌మిటీ స‌మావేశం జరిగింది.

News December 27, 2024

పేర్ని జయసుధ బెయిల్ పిటీషన్‌పై ముగిసిన వాదనలు

image

రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 30న ఆర్డర్ పాస్ చేయనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. బెయిల్ పిటిషన్‌పై ఉదయం నుంచి వాడివేడిగా వాదనలు సాగాయి. జయసుధ తరపున సీనియర్ న్యాయవాది వరదరాజులు, ప్రాసిక్యూషన్ తరఫున జిల్లా కోర్టు పీపీ లంకే వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

News December 27, 2024

కృష్ణా: MBA పరీక్షా ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ పరిధిలో సెప్టెంబర్- 2024లో నిర్వహించిన MBA 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం ఓ ప్రకటనలో సూచించింది.