News December 15, 2024
ఇంధన భద్రత, పొదుపు ప్రతి ఒక్కరి భాద్యత: కడప కలెక్టర్

ఈనెల 14వ తేదీ నుంచి 20వ తేది వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి గోడపత్రాలు, కరపత్రాలను శనివారం తన క్యాంప్ ఆఫీసులో కడప జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి విడుదల చేశారు. ఇంధనాన్ని పొదుపు చేయడంపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ వారోత్సవ ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. ఈ వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.
Similar News
News November 26, 2025
కడప: హౌసింగ్ అక్రమాల్లో చిన్న ఉద్యోగులు బలి.!

గత ప్రభుత్వంలో జిల్లాలో జరిగిన ఇళ్ల నిర్మాణాల్లో కింది స్థాయి ఉద్యోగులను మాత్రమే బలి చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 6298 ఇళ్ల నిర్మాణాల అక్రమాలపై 201 మంది సచివాలయ, మండల స్థాయి ఉద్యోగులకు జీతాలు నిలిపి వేశారు. బిల్లుల చెల్లింపులో DEE, EE, PD, SE, CE, MD స్థాయిలో ప్రతిచోట పరిశీలన జరుగుతోంది. నిర్మాణాలు పరిశీలించకుండానే అధికారులు ఏవిధంగా చెల్లింపులు చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
News November 26, 2025
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్ సంతకం

రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకం చేశారు. పులివెందుల పర్యటనలో ఉన్న ఆయన బుధవారం కోటి సంతకాల సేకరణ ఫారంపై సంతకం చేసి తన వ్యతిరేకతను తెలియజేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వైకాపా ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
News November 26, 2025
ప్రొద్దుటూరులో బంగారు ధరలు ఇలా..

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బంగారు ధరలు బుధవారం ఇలా ఉన్నాయి.
* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.12,590
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.11,583
* వెండి 10 గ్రాములు ధర రూ.1,630 గా ఉంది.
నిన్న, ఈరోజుకి బంగారు ధరలో ఎలాంటి మార్పు లేదు. కానీ నిన్న వెండి 10 గ్రాములు రూ.1,616 ఉండగా నేడు రూ.1630లకు పెరిగింది.


