News February 11, 2025
ఇకపై ఆ రైలు ప్రయాణం మరింత సౌకర్యవంతం

విజయవాడ- సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లను(నం.12713& 12714) మోడరన్ లింక్డ్ హాఫ్మన్ బుష్(LHB) కోచ్‌లతో నడపనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. నేడు సోమవారం నుంచి LHB కోచ్‌లతో నడిచే విధంగా ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఈ రైలును అభివృద్ధి చేశామని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
Similar News
News December 18, 2025
HYD: ‘హద్దు’లు దాటిన ‘విలీనం’

విస్తరణలో భాగంగా GHMC 300 డివిజన్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీనిపై అభ్యర్థనలను నిన్నటి వరకు స్వీకరించింది. అయితే విభజించిన వార్డుల్లో తక్కువ, ఎక్కువ ఓటర్లు ఉన్నారంటూ, అసలు దేని ఆధారంగా ఈ ప్రక్రియ చేశారంటూ భగ్గుమన్నారు. స్వీకరణ గడువు నేటితో ముగియనుంది. 3 వేలకుపైగా అభ్యర్థనలు వచ్చాయని అధికారులు తెలిపారు. డివిజన్లలో హద్దుల మార్పు ఏమైనా జరుగుతుందా, యథావిధిగా ఉంటుందా వేచి చూడాలి.
News December 18, 2025
దావోస్‌కు సీఎం రేవంత్.. కోర్టు గ్రీన్ సిగ్నల్

TG: ప్రపంచ ఆర్థిక సదస్సు (WEF)లో పాల్గొనేందుకు CM రేవంత్ రెడ్డికి ACB కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరిలో స్విట్జర్లాండ్‌లో జరిగే WEFకు హాజరయ్యేందుకు అనుమతి కోరగా రూ.10 వేల పూచీకత్తుపై అనుమతించింది. మార్చి 3 లోపు పాస్‌పోర్టు తిరిగి అప్పగించాలని స్పష్టం చేసింది. 2015 ఓటుకు నోటు కేసులో బెయిల్ షరతుల ప్రకారం రేవంత్ పాస్‌పోర్టు కోర్టు అధీనంలో ఉంది. జనవరి 19-23 వరకు దావోస్‌లో CM పర్యటించనున్నారు.
News December 18, 2025
మహబూబాబాద్‌లో ఎక్కువ.. ములుగులో తక్కువ!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో 88.52 శాతం పోలింగ్‌తో మహబూబాబాద్ ముందు వరుసలో ఉంది. జనగామ 88.48%, వరంగల్ 88.21%, హనుమకొండ 86.45%, భూపాలపల్లిలో 84.02%, ములుగులో 83.88% పోలింగ్ నమోదు అయ్యింది. 24 మండలాల్లో జరిగిన 3వ విడతలో 6.28 లక్షల ఓటర్లుండగా, వారిలో 5.75 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.


