News February 11, 2025
ఇకపై ఆ రైలు ప్రయాణం మరింత సౌకర్యవంతం

విజయవాడ- సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లను(నం.12713& 12714) మోడరన్ లింక్డ్ హాఫ్‌మన్ బుష్(LHB) కోచ్‌లతో నడపనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. నేడు సోమవారం నుంచి LHB కోచ్‌లతో నడిచే విధంగా ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఈ రైలును అభివృద్ధి చేశామని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
Similar News
News February 14, 2026
మధిరలో హ్యాట్రిక్ కౌన్సిలర్‌గా.. BRS తరఫున ఏకైక

మధిర మున్సిపాలిటీ ఏర్పాటైన తర్వాత ఓటమి లేకుండా మూడోసారి హ్యాట్రిక్ కౌన్సిలర్‌గా యన్నంశెట్టి వెంకట అప్పారావు విజయం సాధించారు. తొలిసారి సీపీఎం, రెండోసారి బీఆర్‌ఎస్ నుంచి 8వ వార్డు నుంచి గెలిచిన ఆయన, ఈసారి 19వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మునుగోటి వెంకటేశ్వర్లుపై 192 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మధిరలో బీఆర్‌ఎస్ తరఫున ఏకైక కౌన్సిలర్‌గా నిలవడం విశేషం.
News February 14, 2026
తూర్పు గోదావరి జిల్లాలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

తూర్పు గోదావరి జిల్లాలో 6 కోర్టు అసిస్టెంట్, కోర్ట్ అటెండెంట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, టెన్త్, 7వ తరగతి అర్హత కలిగి, వయసు 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. కోర్టు అసిస్టెంట్‌కు నెలకు రూ.10వేలు, కోర్ట్ అటెండెంట్‌కు రూ.6వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://eastgodavari.dcourts.gov.in/
News February 14, 2026
ఆయిల్ పామ్ తోటల్లో ఈ అంతర పంటలతో మేలు

ఆయిల్ పామ్ మొక్కలు తొలి మూడేళ్లు చిన్నవిగా ఉంటాయి కాబట్టి అంతర పంటలను సాగుతో అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. కొత్తగా నాటిన మొక్కల చుట్టూ జనుము, జీలుగా, పెసర, అపరాలను 5 నుంచి 6 వరుసలుగా విత్తుకోవాలి. దీంతో తేమ ఆరిపోకుండా ఉంటుంది. పూత సమయంలో వీటిని దున్నితే సేంద్రియ పదార్థం పెరుగుతుంది. కూరగాయలు, పొట్టి అరటి, పూల మొక్కలు, మిర్చి, పసుపు, అల్లం, అనాస వంటివి అంతర పంటలుగా సాగు చేయడానికి అనువైనవి.


