News February 7, 2025

ఇకపై లేఖర్ల అవసరం లేదు: డీఐజీ

image

ఆస్తి రిజిస్ట్రేషన్లకు ఇకనుంచి లేఖర్లు అవసరం లేదని రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ జి.బాలకృష్ణ తెలిపారు. గురువారం ఆయన మాడుగుల రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించారు. రిజిస్ట్రేషన్లు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరికి వారే రిజిస్ట్రేషన్లు చేయించుకోవచ్చునని పేర్కొన్నారు. ఆస్తి కొనుగోలుదారులు చలానా తీసిన వెంటనే అన్ని ఆన్‌లైన్‌లో పొందుపరుస్తామన్నారు.

Similar News

News March 28, 2025

అగ్నివీర్‌కు తాంసి యువకులు

image

తాంసి మండలం కప్పర్ల గ్రామానికి సందీప్, తన్వీర్ ఖాన్ అనే యువకులు గురువారం విడుదలైన అగ్నివీర్ ఫలితాల్లో ఎంపికయ్యారు. సందీప్ తండ్రి రమేశ్ వృత్తిరీత్యా వ్యవసాయం, తన్వీర్ ఖాన్ తండ్రి మునీర్ ఖాన్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తారు. పిల్లలకు నచ్చిన రంగాన్ని ప్రోత్సహించేలా తల్లిదండ్రులు సహకరించాలన్నారు. 

News March 28, 2025

జగిత్యాల: ధాన్యం సేకరణ యజ్ఞంగా నిర్వహించాలి: అడిషనల్ కలెక్టర్

image

జగిత్యాల జిల్లాలో రానున్న రబీ సీజన్ ధాన్యం సేకరణ ప్రక్రియను ఒక యజ్ఞంగా, చిత్తశుద్ధిగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ బిఎస్.లత అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం యాసంగి ధాన్యం సేకరణ పై ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రైతులు ధాన్యాన్ని ఒకేసారి కొనుగోలు కేంద్రాలకు తేకుండా వ్యవసాయ అధికారులు చూడాలన్నారు.

News March 28, 2025

ఈ రోజు నమాజ్ వేళలు

image

మార్చి 28, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 5.02 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.14 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.21 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.29 గంటలకు
ఇష: రాత్రి 7.41 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

error: Content is protected !!