News November 11, 2024

‘ఇక్కడ ప్రార్థన చేస్తే కోరికలు నెరవేరుతాయి’

image

విజయవాడ గుణదల మేరీమాత చర్చి ప్రాచుర్యమైంది. ఈ పవిత్ర స్థలాన్ని మేరీమాత మందిరం అని పిలుస్తారు. ఇక్కడి కొండపై ఏర్పాటు చేసిన శిలువ అరుదైనదని భక్తులు చెబుతున్నారు. ఈ శిలువ వద్ద ప్రార్థనలు చేస్తే కోరికలు నెరవేరుతాయని క్రైస్తవుల నమ్మకం. ఇక్కడ నిత్యం చిన్నపిల్లలకు కుట్టు పోగులు, అన్నప్రాసన, తలనీలాలు సమర్పిస్తారు. వివాహాలు చేసుకుంటారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చిలో ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.

Similar News

News December 21, 2025

మచిలీపట్నం-అజ్మీర్‌ స్పెషల్ ట్రైన్ ప్రారంభం

image

మచిలీపట్నం-అజ్మీర్‌ ప్రత్యేక రైలును ఏపీఎస్‌ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు ఆదివారం ప్రారంభించారు. మంత్రి కొల్లు రవీంద్ర తరఫున ఆయన తనయుడు పునీత్‌ ఇనగుదురుపేట జెండా సెంటర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన చాదర్‌ను ర్యాలీగా రైల్వే స్టేషన్‌కు తీసుకువచ్చి అజ్మీర్‌కు పంపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

News December 21, 2025

కృష్ణా: మళ్లీ బీసీ వర్గానికి టీడీపీ జిల్లా పీఠం

image

టీడీపీ కృష్ణా జిల్లా పీఠం మరోసారి BC వర్గాలకే దక్కింది. BC (గౌడ) వర్గానికి చెందిన వీరంకి వెంకట గురుమూర్తిని జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. గత రెండు పర్యాయాలు కూడా BC వర్గానికి చెందిన బచ్చుల అర్జునుడు, కొనకళ్ల నారాయణరావులే TDP జిల్లా అధ్యక్షులుగా పనిచేసి పార్టీ పటిష్టతకు కృషి చేశారు. గురుమూర్తి నాయకత్వంలో కూడా పార్టీ మరింత బలోపేతం కానుందని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

News December 21, 2025

కృష్ణా: మీ పిల్లలకు ఈ చుక్కలు వేయించారా?

image

కృష్ణా జిల్లాలో ఆదివారం ఉదయమే పల్స్ పోలియో కార్యక్రమం మొదలైంది. ఆరోగ్య కార్యకర్తలు తమకు కేటాయించిన శిబిరాలకు చేరుకున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకు వచ్చి పోలియో చుక్కలు వేయిస్తున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు ప్రభుత్వ ఆసుపత్రి, బస్టాండ్, మెయిన్ సర్కిళ్ల వద్ద చుక్కలు వేస్తున్నారు. మీ పిల్లలకూ చుక్కలు వేయించారా? లేదా?