News March 10, 2025

ఇక నుంచి ‘కొమురవెళ్లి పుణ్యక్షేత్రం’ రైల్వే స్టేషన్

image

మనోహరాబాద్- కొత్తపల్లి నుంచి హైదరాబాద్ వరకు వేస్తున్న కొత్త రైల్వే పనులు త్వరలో పూర్తి కానున్నాయి. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయ రైల్వే జంక్షన్‌కు ‘కొమురవెల్లి పుణ్యక్షేత్రం’ అని నామకరణం చేసింది. ఈ మేరకు రైల్వే శాఖ విడుదల చేసిన ఉత్తర్వుల్లో మరో మూడు స్టేషన్‌లు గుర్రాలగొంది, చిన్నలింగపూర్, సిరిసిల్ల పేర్లను లిస్టులో పెట్టారు.

Similar News

News February 25, 2026

గొల్లప్రోలు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

గొల్లప్రోలు మండలం వన్నెపూడి జాతీయ రహదారి-16పై బుధవారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. హైవే జంక్షన్ వద్ద రాంగ్ రూట్‌లో వచ్చిన ఆటో, మోటార్ బైక్‌ను బలంగా ఢీకొట్టిందని గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 25, 2026

చెప్పుల స్టాండ్ ఎక్కడ ఉండాలంటే?

image

ఇంటి ప్రధాన ద్వారం మహాలక్ష్మి ప్రవేశించే ప్రదేశమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘అందుకే చెప్పులను గుమ్మానికి అడ్డంగా ఉంచకూడదు. అలా విడిస్తే సానుకూల శక్తి ఆగిపోతుంది. ఇంటి యజమాని గౌరవం తగ్గుతుంది. చెప్పుల స్టాండ్ ఇంటికి పశ్చిమ/వాయువ్య దిశలో ఉంచటం శ్రేయస్కరం. షూ రాక్‌ను ఎప్పుడూ మూసి ఉంచాలి. క్రమ పద్ధతిలో అమర్చాలి. ఉత్తర/తూర్పు దిశల్లో ఉంచితే ఇబ్బందులు కలుగుతాయి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News February 25, 2026

పాలమూరు: టెన్త్ విద్యార్థులు ALERT.. 5Mit సడలింపు

image

ఈ ఎడాది 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రభుత్వం 5 నిమిషాల సడలింపును ఇచ్చిందని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. ఐదు నిమిషాల సడలింపు అనంతరం పరీక్షకు హాజరయ్యే వారిని ఎట్టి పరిస్థితులలో అనుమతించరని, పరీక్షలు జరిగే రోజున చుట్టుపక్కల ఉండే జిరాక్స్ కేంద్రాలు అన్ని మూసివేయాలని, ఆయా శాఖల అధికారులు పరీక్ష కేంద్రాలను ముందే సందర్శించి అవసరమైన ఏర్పాట్లను చేసుకోవాలని సూచించారు.