News March 10, 2025
ఇక నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తాం: VZM SP

విజయనగరం జిల్లాలో MLC ఎన్నికల కోడ్ ముగియడంతో ఇకపై యథావిధిగా ప్రతీ సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో PGRS కార్యక్రమం నిర్వహిస్తామని ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదులు ఇవ్వవచ్చన్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం జరుగుతుందని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.
Similar News
News March 16, 2025
విజయనగరం: 119 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు

విజయనగరం జిల్లాలో సోమవారం నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని DEO యు. మాణిక్యం నాయుడు వెల్లడించారు. ఆయన వివరాల ప్రకారం.
➤ జిల్లాలో మొత్తం ఎగ్జాం సెంటర్లు: 119
➤ పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్య: 23,765
➤ ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు: 7
➤ సిట్టింగ్ స్క్వాడ్‌లు: 2
➤ ఇన్విజిలేటర్లు:2,248
☞ అందరికీ Way2News తరఫున All THE Best
News March 15, 2025
VZM: ‘ప్రభుత్వ ఆదాయాన్ని పెంచండి’

విజయనగరంలోని GST కార్యాలయాన్ని రాష్ట్ర జీఎస్టీ కమిషనర్, జిల్లా ప్రత్యేకాధికారి ఏ.బాబు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో పన్ను వసూళ్లపై చర్చించారు. రాష్ట్ర రెవెన్యూ పెంపుపై కొన్ని మార్గదర్శకాలను ఆయన అందజేశారు. మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలని సూచించారు. ప్రభుత్వానికి రావలసిన రెగ్యులర్ రిటర్న్, బకాయి పన్నుల వసూలు చేయాలన్నారు.
News March 15, 2025
VZM: ఈనెల 16న FRO ఉద్యోగాలకు రాతపరీక్ష

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 16న జరిగే రాతపరీక్షకు పకడ్బంధీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి ఆదేశించారు. పట్టణంలోని తమ ఛాంబర్లో శనివారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12 గంటలు వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటలు వరకు జరుగుతాయని చెప్పారు. రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.