News November 1, 2024
ఇచ్చాపురం చేరుకున్న సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చాపురం చేరుకున్నారు. మండలంలోని ఈదుపురం గ్రామంలో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నరసన్నపేట నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని సీఎం చంద్రబాబును కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
Similar News
News December 4, 2025
శ్రీకాకుళం: రైలు ప్రయాణికులకు అలర్ట్

రైల్వే ట్రాక్ మరమ్మతుల కారణంగా ఇటీవల శ్రీకాకుళం జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు అయ్యాయి. వీటిని రీ షెడ్యూల్ చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ బుధవారం పేర్కొంది. హౌడా-సికింద్రాబాద్(12703), చెన్నై-హౌడా (12840) ఎక్స్ప్రెస్లు డిసెంబర్ 4, 8, 9, 10,11 తేదీల్లో నిర్ణీత సమయం కంటే 2 గంటలు ఆలస్యంగా నడుస్తాయని ఆ శాఖ జీఎం పరమేశ్వర్ తెలిపారు.
News December 4, 2025
మూలపేట పొర్టు నిర్మాణంపై అప్డేట్

టెక్కలి నియోజకవర్గం మూలపేట పోర్టు నిర్మాణం జాప్యం అవుతోంది. దీని వ్యవధిని 2026 నవంబర్కు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు రూ. 2949.70 కోట్లతో విశ్వసముద్ర పోర్టు కాంట్రాక్ట్ సంస్థ పనులను 2023 ఏప్రిల్లో ప్రారంభించింది. కాంట్రాక్టర్ గడువు ఈ ఏడాది అక్టోబర్ 17తో ముగిసింది. పెండింగ్ పనుల దృష్ట్యా కట్టడాల కాలపరిమితిని పెంచుతూ తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
News December 4, 2025
ఎచ్చెర్ల: రిజల్ట్స్ వచ్చాయి

ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ LLB 2, 4, 6, 8, 10వ సెమిస్టర్ల పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈమేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ ఉదయ్ భాస్కర్ బుధవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రిజల్ట్స్ను అధికారిక వెబ్ సైట్ https://brau.edu.in/లో పొందుపరిచామన్నారు. 95 మందికి 84 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.


