News November 1, 2024

ఇచ్చాపురం చేరుకున్న సీఎం చంద్రబాబు

image

సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చాపురం చేరుకున్నారు. మండలంలోని ఈదుపురం గ్రామంలో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నరసన్నపేట నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని సీఎం చంద్రబాబును కోరారు‌. నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Similar News

News December 7, 2024

శ్రీకాకుళం: పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు గమనించాలి 

image

చదువుకుంటున్న పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు ప్రతి రోజు కనిపెడుతూ ఉండాలని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని గుజరాతీ పేటలో స్థానిక అందవరపు వరహా నరసింహం (వరం )హైస్కూల్ నందు శనివారం ఉదయం జరిగిన మెగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాదకద్రవ్యాలు వద్దు బ్రో అనే ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

News December 7, 2024

శ్రీకాకుళం: ప్రాణం తీసిన ఇన్‌స్టా చాటింగ్

image

విశాఖ పీఎంపాలెంలో నిన్న ఒకరు సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. శ్రీకాకుళం పట్టణానికి చెందిన హేమంత్ రెడ్డికి 2017లో వివాహం జరిగింది. డెలీవరీ బాయ్‌గా పనిచేసే అతడు భార్య(25)తో కలిసి పీఎంపాలెంలో ఉంటున్నారు. భార్య శుక్రవారం ఇన్‌స్టాగ్రాంలో ఒకరితో చాటింగ్ చేయడాన్ని గమనించి గొడవ పడ్డారు. ఈ విషయం అత్తమామలకు తెలిసి మందలించడంతో ఆమె మనస్తాపానికి గురైంది. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది.

News December 7, 2024

శ్రీకాకుళం: హత్యకు దారి తీసిన భూవివాదం

image

శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకూర్మంలో ఓ వ్యక్తి శుక్రవారం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇదే గ్రామానికి చెందిన రాజేశ్ (38), రాములపై నలుగురు వ్యక్తులు కత్తులు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో రాజేశ్ అక్కడిక్కడే మృతి చెందాడు. రాముకు తీవ్రగాయాల్యయి. స్థానిక కుటుంబంతో భూవివాదాలపై జరిగిన గొడవలు ఈ హత్యకు కారణమని ఎస్సై జనార్దన్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశారు.