News October 16, 2024

ఇచ్చిన మాట తప్పం: పొంగులేటి

image

అర్హులైన రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గత ప్రభుత్వం గడిచిన పదేళ్లలో రూ.13,500 కోట్లు రెండు విడతలుగా మాఫీ చేస్తే ప్రస్తుతం ప్రభుత్వం 26 రోజుల్లో రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేసిందని, ఇంకా 13 వేల కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వం మాట ఇస్తే తప్పదని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో రూ.13 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని పొంగులేటి చెప్పారు.

Similar News

News October 28, 2025

పాలేరు జలాశయంలో భారీ చేప

image

కూసుమంచి మండలం నాయకన్ గూడెంకు చెందిన జాలరి మేకల పరశురాములుకు పాలేరు జలాశయంలో భారీ చేప లభించింది. వేటకు వెళ్లగా ఆయన వలలో 19 కేజీల మీసాలజెల్ల చేప చిక్కింది. దీని ధర కేజీ రూ.200 ఉంటుందని పరశురాములు వెల్లడించాడు. ఇలా మీసాలతో ఉండే చేపలు జలాశయంలో అరుదుగా లభ్యమవుతాయన్నాడు.

News October 28, 2025

NOV 1 నాటికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో నవంబర్ 1నాటికి 100% కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వరి 2,98,773,34 ఎకరాలు, పత్తి 2,51,980, 1,816,12 ఎకరాల్లో మొక్కజోన్న సాగు చేశారు. ప్రస్తుతం ఈ మూడు పంటలను కోస్తున్న రైతులు కల్లాలో పంటను ఆరబోస్తున్నారు. తుపాను ప్రభావం జిల్లాపై ఉంటుందని చెబుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి నల్లబడుతుందని దిగాలుగా ఉన్నారు.

News October 28, 2025

ఖమ్మం: కార్తీకమాసం.. అరుణాచలంకు ప్రత్యేక బస్సు

image

కార్తీకమాసం సందర్భంగా ఖమ్మం కొత్తబస్టాండ్ నుంచి అరుణాచలంకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును ఏర్పాటు చేసినట్లు ఆర్ఎం సరీరాం తెలిపారు. నవంబర్ 3న రాత్రి 7గంటలకు బస్సు బయలుదేరి 4వ తేదీ కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం అనంతరం అరుణాచలం చేరుకుంటుందన్నారు. టికెట్ ధర పెద్దలకు రూ.5000, పిల్లలకు రూ.2530గా నిర్ణయించారు. వివరాలకు 91364 46666, 99592 25979, 99592 25965లను సంప్రదించవచ్చని కోరారు.