News October 16, 2024
ఇచ్చిన మాట తప్పం: పొంగులేటి
అర్హులైన రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గత ప్రభుత్వం గడిచిన పదేళ్లలో రూ.13,500 కోట్లు రెండు విడతలుగా మాఫీ చేస్తే ప్రస్తుతం ప్రభుత్వం 26 రోజుల్లో రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేసిందని, ఇంకా 13 వేల కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వం మాట ఇస్తే తప్పదని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో రూ.13 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని పొంగులేటి చెప్పారు.
Similar News
News November 4, 2024
నేడు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పునః ప్రారంభం
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం నుంచి క్రయవిక్రయాలు పునః ప్రారంభం కానున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు ఆదివారం తెలిపారు. వరుసగా నాలుగు రోజుల సెలవులు అనంతరం సోమవారం మార్కెట్ ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ విషయాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగ సోదరులు గమనించి తమ పంటలను మార్కెట్‌కు తీసుకువచ్చి అమ్మకాలు జరపాలని అధికారులు పేర్కొన్నారు.
News November 3, 2024
భద్రాద్రి రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో ఆదివారం స్వామివారికి అర్చకులు సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. ఉదయం 4 గంటలకే అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.
News November 3, 2024
ప్రభుత్వాల తలరాత మార్చే శక్తి ఉద్యోగులకు, ఉద్యోగ సంఘాలకు ఉంది: తుమ్మల
ప్రభుత్వాల తలరాత మార్చే శక్తి ఉద్యోగులకు, ఉద్యోగ సంఘాలకు ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఖమ్మం నగరంలో ఉద్యోగుల జేఏసీ సెక్రటరీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన వన సమారాధన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ప్రజా ప్రభుత్వంలో ఉద్యోగులు భాగస్వాములు కావాలని కోరారు. రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులదే కీలకపాత్ర అని పేర్కొన్నారు.