News January 21, 2025

ఇచ్చిన మాట ప్రకారం నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: పొన్నం

image

సిరిసిల్ల చేనేత కార్మికులకు ప్రజా పాలన ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం స్వయం సహాయక సంఘాలకు అందించే యూనిఫాం చీరల ఆర్డర్ ఇచ్చి పెద్ద ఎత్తున పని కల్పించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు అందించే ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా అందరికీ ఒకే రంగు గల ఒక్కొకరికి ఒక్కో చీరను అందజేసేందుకు 4.24 కోట్ల మీటర్ల చీరల ఆర్డర్స్ అందజేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News December 15, 2025

రామడుగు హరీష్‌కు ‘ఒక్క’ ఓటు అదృష్టం!

image

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దూరుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి రామడుగు హరీష్‌ సంచలన విజయం సాధించారు. ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన హరీష్‌పై అందరి దృష్టి పడింది. ఆయన తన సమీప ప్రత్యర్థిపై కేవలం ఒక్కే ఒక్క ఓటు మెజారిటీతో గెలుపొందడం విశేషం. ఒక ఓటుతో గెలుపొందడం తన అదృష్టంగా భావిస్తున్నానని హరీష్ తెలిపారు.

News December 14, 2025

ముంజంపెల్లి: ఒక్క ఓటు మెజారిటీతో సర్పంచ్‌గా గెలుపు

image

మానకొండూర్ మండలం ముంజంపెల్లి సర్పంచ్ ఎన్నికలో ఉత్కంఠ నెలకొంది. నందగిరి కనక లక్ష్మి (INC) ఒక్క ఓటు మెజారిటీతో విజయం సాధించారు. తొలి లెక్కింపులో ఆమెకు 878 ఓట్లు రాగా, సమీప అభ్యర్థి వెలుపు గొండ కొమురమ్మ (BRS)కు 877 ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్ తర్వాత కూడా కనక లక్ష్మికే 1 ఓటు ఆధిక్యం రావడంతో ఆమెను విజేతగా ప్రకటించారు.

News December 14, 2025

మహాత్మనగర్‌లో ఒక్క ఓటుతో సంపత్‌ విజయం

image

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మనగర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి పొన్నాల సంపత్ సంచలన విజయం నమోదు చేశారు. కేవలం ఒక్క ఓటు మెజారిటీతో సంపత్ సర్పంచ్‌గా గెలుపొందారు. ఈ స్వల్ప తేడాతో గెలవడంతో గ్రామంలో ఉత్కంఠ నెలకొంది. సంపత్‌కు గ్రామ ప్రజలు, అభిమానులు అభినందనలు తెలిపారు. తన గెలుపునకు సహకరించిన గ్రామ ప్రజలకు సంపత్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.