News April 1, 2025

ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్: అనిత

image

యువగళం పాదయాత్రలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అనకాపల్లి-అచ్యుతాపురం నాలుగు లైన్ల రహదారిని నిర్మిస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని రాష్ట్ర హోం శాఖామంత్రి వంగలపూడి అనిత గుర్తు చేశారు. ఇచ్చిన హామీ మేరకు మంత్రి రహదారి విస్తరణకు నిధులు మంజూరు చేయడమే కాకుండా సోమవారం శంకుస్థాపన చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News November 21, 2025

తులసికి సమర్పించకూడని నైవేద్యాలివే..

image

తులసి మొక్కపై లక్ష్మీ దేవి ఉంటారని నమ్ముతాం. అందుకే పూజలు చేస్తాం. అయితే ఈ దేవతకు కొన్ని నైవేద్యాలు సమర్పించడం నిషిద్ధమని పండితులు చెబుతున్నారు. శివ పూజకు వాడిన బిల్వ పత్రాలు, పారిజాత పూలు తులసికి సమర్పించకూడదట. చెరుకు రసం కూడా నిషిద్దమేనట. పాలు కలిపిన నీరు, నల్ల విత్తనాలు కూడా వద్దని సూచిస్తున్నారు. గణపతి పూజకు ఉపయోగించిన ఏ వస్తువునూ తులసికి సమర్పించకూడదనే నియమం ఉందంటున్నారు.

News November 21, 2025

మాజీ మంత్రి శైలజానాథ్‌కు మాతృవియోగం

image

శింగనమల వైసీపీ ఇన్‌ఛార్జి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ తల్లి సాకే గంగమ్మ మృతి చెందారు. అనంతపురంలోని రామకృష్ణ నగర్‌లో నివాసం ఉంటున్న ఆమె శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తల్లి మృతితో శైలజానాథ్ కుటుంబంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు శైలజానాథ్‌ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

News November 21, 2025

మరో తుఫాను ‘సెన్‌యార్‌’!

image

రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం బలపడి తుఫానుగా మారే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఈ తుఫానుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించిన ‘సెన్‌యార్’ పేరును IMD పెట్టనున్నట్లు సమాచారం. సెన్‌యార్ అంటే ‘లయన్’ అని అర్థం. తుఫాను ప్రభావంతో 24వ తేదీ నుంచి తమిళనాడులో, 26-29వరకు ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. ఇటీవల ‘మొంథా’ తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే.