News May 20, 2024
ఇచ్చోడలో భార్యను చంపిన భర్త

భార్యని భర్త హత్య చేసిన ఘటన ఇచ్చోడ మండలంలో చోటుచేసుకుంది. ఇంద్రవెల్లి మండలం సత్వాజీగూడకు చెందిన రేణుక(28)కు, ఇచ్చోడ మండలం గాంధీనగర్కు చెందిన వెంకట్తో 2015లో వివాహమైంది. మద్యానికి బానిసైన వెంకట్ డబ్బుల కోసం శనివారం భార్యతో గొడవ పడ్డాడు. ఆమె నిరాకరించడంతో మద్యం మత్తులో ఆమె మెడకు తాడు బిగించి హత్య చేసి పరారైనట్లు CI భీమేశ్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Similar News
News December 25, 2025
ADB: ఆన్లైన్ గేమ్లకు బానిస.. కుమారుడిపై తల్లి ఫిర్యాదు

ఆన్లైన్ గేమ్లకు బానిసగా మారిన తన కుమారుడిపై తల్లి ఆదిలాబాద్ టూటౌన్లో బుధవారం ఫిర్యాదు చేసినట్లు ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. షేక్ సోహెల్ ఆన్లైన్లో ఆటలు ఆడుతూ డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు తరచూ డబ్బులివ్వాలని తల్లిని, భార్యను శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు విద్యానగర్లో ఉండే సామెరా బీ ఫిర్యాదు చేసిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.
News December 24, 2025
ADB: 27న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ క్రాస్ కంట్రీ ఎంపికలు

ఈ నెల 27న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలు అండర్-16,18, 20 బాల బాలికలకు, మెన్ అండ్ ఉమెన్స్కి వేరువేరుగా ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అధ్యక్షుడు బోజా రెడ్డి తెలిపారు. ప్రతిభ గల క్రీడాకారులను ఎంపిక చేసి జనవరి 2న హైదరాబాద్లో జరిగే రాష్ట్ర పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. అర్హులైన, ఆసక్తిగల క్రీడాకారులు పాల్గొనాలని కోరారు.
News December 23, 2025
ADB: ‘ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి’

ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలియజేశారు. సోమవారం హైదరాబాదు నుంచి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పాల్గొన్నారు. వచ్చే వారంలోగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో వృద్ధి నమోదు కావాలన్నారు. ఫారం-8 ద్వారా అసలైన ఫోటోగ్రాఫ్ సేకరించి నవీకరించాలని సూచించినట్లు శ్యామలాదేవి పేర్కొన్నారు.


