News February 2, 2025

ఇచ్చోడలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

image

మామడ (M) పులిమడుగుకు చెందిన తులసిరాం, రాజు శనివారం బైక్‌పై ఇంద్రవెల్లి (M) కేస్లాపూర్ నాగోబా జాతరకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో అధికవేగంతో ప్రయాణిస్తున్న వారి బైకు ఇచ్చోడ (M) దుబార్ పేట్ వద్ద లారీని తప్పించబోయి కిందపడింది. దీంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిని అంబులెన్స్‌లో రిమ్స్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాజు మృతి చెందాడని ఎస్సై తిరుపతి తెలిపారు.

Similar News

News February 18, 2025

నేనొచ్చాక కూడా అధికారులు రారా..?: కలెక్టర్

image

ప్రజావాణిలో చాలా మంది అధికారులు తాను వచ్చిన తరువాత కూడా రావడం లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలుంటాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. సోమవారం ప్రజావాణిలో ఆయన పాల్గొన్నారు. కలెక్టర్ వచ్చిన కూడా అధికారులు రాకపోవడం సరైన విధానం కాదన్నారు. తర్వాత గ్రీవెన్స్ వచ్చిన అధికారులు వారికి సంబంధించిన అర్జీలపై కలెక్టర్‌కు వివరణ ఇచ్చారు. ఫిర్యాదు విభాగంలో 69 అర్జీలు స్వీకరించారు.

News February 18, 2025

నేరడిగొండ: ఒకేరోజు 700మంది రక్తదానం

image

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నేరడిగొండలోని తన నివాసం వద్ద నిర్వహించిన రక్తదాన శిబిరానికి భారీగా స్పందన వచ్చింది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వికలాంగులు, అభిమానులు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రక్తదానం చేస్తూ ప్రతి ఒక్కరు కేసిఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రక్తదాన శిబిరంలో 700 మందికి పైగా రక్తదానం చేశారని పేర్కొన్నారు.

News February 18, 2025

పదో తరగతి ప్రత్యేక తరగతులను పర్యవేక్షించాలి: ADB కలెక్టర్

image

పదో తరగతి ప్రత్యేక తరగతులపై మండల ప్రత్యేకాధికారులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మండలాల వారీగా పాఠశాలలకు ప్రత్యేక అధికారులను నియమించామని పేర్కొన్నారు. విద్యార్ధులు ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు.

error: Content is protected !!