News March 16, 2025
ఇచ్ఛాపురం: కరెంటు స్తంభాన్ని ఢీకొని వ్యక్తి మృతి

ఇచ్ఛాపురం మండలం కొలిగాం గ్రామ సమీప మలుపు వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బిహార్‌కు చెందిన రాజేశ్ ఓ ఇటుకుల కంపెనీలో పనిచేస్తున్నాడు. పని ముగించుకుని మరో వ్యక్తితో బైక్‌పై అతివేగంగా వస్తూ.. కరెంటు స్తంభాన్ని ఢీ కొన్నారు. ఈ ప్రమాదంలో రాజేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నారు.
Similar News
News March 16, 2025
సారవకోట: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

సారవకోట మండలం కురిడింగి గ్రామం వద్ద పాతపట్నం నర్సంపేట హైవే రోడ్డుపై లారీ కారు పరస్పరం ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరి మృతి చెందారు. ఆదివారం పాతపట్నం నుంచి నరసన్నపేట వైపు వెళ్తున్న లారీ, నరసన్నపేట నుంచి పాతపట్నం వైపు వస్తున్న కారు ఎదురెదురుగా ఢీకొనడంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఘటనా స్థలంలో చనిపోయారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
News March 16, 2025
శ్రీకాకుళంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ దారి జడ్జి బంగ్లా ఎదురుగా గల మురికి కాలువలో ఓ గుర్తుతెలియని వ్యక్తి (45) పడిపోయి ఉండగా స్థానికులు ఈ నెల 13న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడని శ్రీకాకుళం టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వ్యక్తి ఆచూకీ తెలిస్తే 63099 90824 నంబర్‌ను సంప్రదించాలని సీఐ సూచించారు.
News March 16, 2025
కలకత్తా నుంచి కన్యాకుమారికి సైకిల్ ర్యాలీ

సీఐఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కలకత్తా నుంచి కన్యాకుమారి వరకు 6,500 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం గుండా సైకిల్ ర్యాలీని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ ర్యాలీ శనివారం రాత్రి ఆంధ్ర రాష్ట్రంలోకి విచ్చేసిన సందర్భంగా కంచిలిలో వారికి ఘనంగా స్వాగతం పలికారు. భారతమాతాకి జై అంటూ వారు నినాదాలు చేశారు. ఈ ర్యాలీ పాల్గొన్న 60 మందిని సత్కరించారు.